కొత్త కాన్సెప్ట్‌..బ‌బుల్ రూమ్స్‌

Update: 2017-11-13 09:35 GMT

చాలా మందికి గ‌డ్డ క‌ట్టే చ‌లిలో అలా అలా తిరిగి రావాల‌ని ఉంటుంది. కానీ ఎక్కువ సేపు అలా ఉంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భ‌యం. అందుకే ఆ సాహ‌సం చేయ‌లేరు. అదే స‌మ‌యంలో చుట్టూ ఉన్న అద్భుత‌మైన వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేయాల‌ని ఉంటుంది. అక్క‌డా స‌మ‌స్య‌లే. కానీ ఈ ప‌రిస్థితుల‌ను అధిగ‌మించేందుకు ఓ హోట‌ల్ అద్భుత‌మైన కాన్సెప్ట్ తో ముందుకు వ‌చ్చింది. అదే బ‌బుల్ రూమ్స్‌. అవి ఎక్క‌డ అంటారా?. ఐస్ ల్యాండ్ లో. పూర్తి పార‌దర్శ‌కంగా ఉండే ఈ బ‌బుల్ రూమ్స్ లో ఆరు బ‌య‌టే ఉండి హాయిగా నిద్రించవ‌చ్చు. పండు వెన్నెల‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. గ‌డ్డ‌క‌ట్టే చ‌లిలో అలా నిద్ర‌పోవ‌చ్చు.

                             చలిలో ఎలా సాధ్యం అంటారా?. ఈ బ‌బుల్ రూమ్స్ లోని గెస్టులు త‌మ‌కు కావాల్సిన విధంగా టెంప‌రేచ‌ర్ ను మెయింటెన్ చేసుకోవ‌చ్చు. ప‌ర్యాట‌కుల కోరిక మేర‌కే తాము ఈ కాన్సెప్ట్ ను తెర‌పైకి తెచ్చిన‌ట్లు చెబుతోంది హోట‌ల్ యాజ‌మాన్యం. ఐస్ ల్యాండ్ లోని ఫైవ్ మిలియ‌న్ స్టార్ హోట‌ల్ ఈ రూమ్ ల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రూమ్ లు అన్నీ కూడా మంచి గుబురుగా ఉండే చెట్లు..ఆహ్ల‌ద వాతావ‌ర‌ణంలోనే ఏర్పాటు చేశారు. రెండు బెడ్స్ తో ఈ రూమ్ ల‌ను ఏర్పాటు చేశారు. వీటిలో ఉంటూ హాయిగా బ‌య‌టి వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేయ‌వచ్చ‌న్న మాట‌.

Similar News