ఒక్కసారి లావు అయితే తగ్గటం ఎంత కష్టమో స్వీటీ అనుష్క తెలుసుకున్నట్లు ఉంది. అందుకే ఓ భారమైన సందేశాన్ని ట్విట్టర్ లో పోస్టు చేసింది. 'కలలు మాయలతో నిజం కావు. కఠోర శ్రమ, నిబద్ధతతో చెమట చిందిస్తేనే కలలు సాకారమవుతాయి' అంటూ కామెంట్ చేసింది. ఇది ఎందుకో ఇప్పటికే అర్థం అయి ఉంటుంది. సైజ్ జీరో కోసం బాగా లావు అయిన అనుష్క తర్వాత కాలంలో ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమా విషయంలోనూ ఆమె దర్శకుడు రాజమౌళితో చివాట్లు తినాల్సి వచ్చిందనే వార్తలు వచ్చాయి.
తర్వాత నుంచి అనుష్క లావు అనేది ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే ఎలాగోలా చెమటోడ్చి లావు సమస్య నుంచి అనుష్క బయటపడినట్లు కన్పిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా తానే ఓ ఫోటోను పోస్టు చేయటం ద్వారా చెప్పింది. అనుష్క షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా మార్చి బాబ్ కట్ లో స్లిమ్ గా పూర్తిగా న్యూలుక్ లో దర్శన మిచ్చింది అనుష్క.