అనుష్క మాయ‌చేసిందా!

Update: 2017-11-08 10:08 GMT

అంద‌రి మ‌దిలో ఇప్పుడు అదే సందేహం. భాగ‌మ‌తి ఫ‌స్ట్ లుక్ లో స్లిమ్ గా క‌న్పించిన స్వీటీ అనుష్క ఏ మాత్రం త‌గ్గిన‌ట్లు లేదు. ఆ ఫోటో అంతా గ్రాఫిక్స్ మాయ‌తోనే స్లిమ్ అయిన‌ట్లు క‌న్పిస్తోంది. బాహుబ‌లి 2లోనూ రాజ‌మౌళి గ్రాఫిక్స్ ద్వారా స్వీటీని స‌న్న‌గా చేసేందుకు నానా తిప్ప‌లుపడ్డ విష‌యం తెలిసిందే. ఒక్క సినిమా కోసం లావు అయి త‌ర్వాత తగ్గ‌టానికి అనుష్క అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. యోగా బ్యూటీ అయితే ఈ భామే అంత క‌ష్ట‌ప‌డ్డా ఫ‌లితం ఉండ‌టంల లేదంటే ఇక మామూలు వాళ్ల ప‌రిస్థితి ఏంటి?.. ప‌లు సినిమాల్లో త‌న పంచ్ డైలాగుల‌తో కిత‌కిత‌లు పెట్టించే విద్యుల్లేఖ షేర్ చేసిన ఫోటోనే దీనికి కార‌ణం.

                         ఈ ఫోటో ఇప్పుడు ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున సంద‌డి చేస్తోంది. అనుష్క పుట్టిన రోజు సందర్భంగా భాగమతి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న హాస్యనటి విధ్యుల్లేక రామన్‌ ఆన్‌లోకేషన్‌ ఫొటోలను ట్వీట్‌ చేసింది. ఈ ఫొటోలలో అనుష్క ఎప్ప‌టిలాగే బొద్దుగానే కనిపిస్తోంది. దీంతో ఫస్ట్‌ లుక్‌లో అనుష్క స్లిమ్‌ గా కనిపించటం గ్రాఫిక్స్‌ వల్లే సాధ్యమయ్యిందనే ప్ర‌చారం మొదలైంది.

Similar News