స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా శరవేగంగా రెడీ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న ‘ నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా అను ఇమ్మాన్యుయల్ నటిస్తోంది. వక్కంతం వంశీ కథ రెడీ చేసిన రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శిరీషా శ్రీధర్ లగడపాటి, బన్నీవాన్ వ్యవహరిస్తున్నారు.