పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో శుభవార్త. ఇప్పటికే అజ్ఞాతవాసి సినిమా ఫస్ట్ లుక్ తో పవన్ ఫ్యాన్స్ మాంచి జోష్ లో ఉన్నారు. ఇప్పుడు వారికి మరో కీలక ఘట్టమైన ఆడియో విడుదల తేదీ కూడా వచ్చేసింది. ఇప్పటికున్న ప్రాధమిక సమాచారం ప్రకారం డిసెంబర్ 18న ఆడియో విడుదల కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని తలపెట్టారు. ఈ అజ్ఞాతవాసి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా..పవన్ కళ్యాణ్ జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని ఒక పాటను రిలీజ్ చేశారు. తొలిసారిగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ దీనికి స్వరాలందించారు.