Telugu Gateway
Telangana

ఈడీ..బోడి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డం

ఈడీ..బోడి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డం
X

టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ మ‌రోసారి కేంద్రంపై విరుచుకుప‌డ్డారు. కేంద్రంలో ప్ర‌త్యామ్నాయ ప్ర‌భుత్వాన్ని తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని ఆ శ‌క్తి త‌న‌కు ఉంద‌న్నారు. దేశవ్యాప్తంగా ధాన్యం సేక‌ర‌ణ‌కు ఒకే విధానం తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. కేంద్ర ప్రభుత్వం తనపై ఈడీ దాడులకు దిగినా భయపడనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటివి అన్నిచోట్ల పనిచేయవు. బోడి బెదిరింపులకు భయపడమని అన్నారు.దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే తాన ప్రయత్నాలని అన్నారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చాలా శూన్యత ఉంది. అందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. దేశంలో కొత్త జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు.ఉద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా బలపడే ఆలోచన తప్ప యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.

బీజేపీకి ప్రొగ్రెసివ్‌ ధోరణి లేదు.బీజేపీ పాలనలోనే బ్యాంకుల స్కామ్‌లు పెరిగాయని అన్నారు. 11 లక్షల కోట్లు బ్యాంకులు మాఫీ చేస్తాయి కానీ ధాన్యం కొనుగోళ్లకు 11 వేల కోట్లు లేవా?అని సీఎం ప్రశ్నించారు.ఆహారభద్రత బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు.కరువు వస్తే వారంరోజులు ప్రజలకు అన్నం పెట్టే పరిస్థితి ఏ దేశానికి లేదు. దేశంలో నేషనల్‌ ప్రొక్యూర్మెంట్‌ పాలసీ ఉండాలన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతులకు రాజ్యాంగ రక్షణ లేదన్నారు. అన్ని సూచీల్లో భారతస్థానం దిగజారుతోందని కేసీఆర్ ఆరోపించారు. రైతుల కోసం ఎంతకైనా పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమం స్థాయిలో కేంద్రంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం వినకపోతే యాక్షన్‌ ఓరియంటెడ్‌గా తమ పోరాటం ఉంటుందని చెప్పారు. తమ మంత్రులు, ఎంపీల బృందం ఆహార మంత్రికి విజ్ఞప్తి చేశారన్నారు. ఎక్కువ పంట వస్తే ప్రాసెస్‌ చేసి నష్టం వస్తే కేంద్రం భరించాలని డిమాండ్ చేశారు. పంట మార్పిడి కింద 25 లక్షల ఎకరాలు తగ్గిందన్నారు. ''మరో 2 లక్షల ఎకరాలు సొంత అవసరాలకు వాడుకుంటారు.

3 లక్షల ఎకరాలు విత్తనాల కోసం రైతులు వాడుకుంటారు. ఈసారి యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం వస్తుంది. మా దగ్గర ధాన్యం తీసుకోండి... ఏ రైస్‌ తీసుకుంటారో మీ ఇష్టం. బాయిల్డ్‌ రైస్‌ తీసుకుంటారా, రా రైస్‌ తీసుకుంటారా అనేది కేంద్రం బాధ్యత. ఎంఎస్ పి నిర్ణయించేది బియ్యానికి కాదు, ధాన్యానికి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మెలికలు పెట్టకూడదు. ఇది రైతుల జీవన్మరణ సమస్య.'' అని సీఎం కేసీఆర్‌ అన్నారు. యాసంగిలో వరిని పంజాబ్‌ నుంచి కొన్నట్లే... తెలంగాణ నుంచి కూడా కేంద్రమే కొనుగోలు చేయాలి. మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలుస్తారు. రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారు. 30 లక్షల ఎకరాల్లో వచ్చిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలి. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదు. ధాన్యం కొనుగోలు విషయంలో దేశమంతటికీ ఒకే పాలసీ ఉండాలి.'' అని కేసీఆర్ అన్నారు.

Next Story
Share it