Telugu Gateway
Telangana

ఢిల్లీకి తెలంగాణ మంత్రులు

ఢిల్లీకి తెలంగాణ మంత్రులు
X

ముఖ్య‌మంత్రి కెసీఆర్ ఆదేశాల మేర‌కు తెలంగాణ మంత్రులు ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లారు. వీరు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతోపాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అపాయింట్ మెంట్ కోరారు. ఈ మంత్రుల బృందంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు , జగదీశ్వర్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్ , వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోవ‌టానికి తెలంగాణ స‌ర్కారు రెడీ అయింది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అదనపు ధాన్యం కొనుగోలుపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి ఆమోదం తెలపలేద‌న్నారు.

యాసంగి వరి ధాన్యం విషయంలో రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ పార్లమెంటు సాక్షిగా తప్పుడు ప్రకటనలతో కేంద్రం ద్వందవిధానాలు అనుస‌రిస్తుంద‌ని మంత్రులు మండిప‌డుతున్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల గురించి పట్టుబట్టకుండా కేంద్రం చెప్పినట్లు ఆడుతున్న తెలంగాణ బీజేపీ ఎంపీలు, నేతలు అంటూ టీఆర్ఎస్ పార్టీ, ప్ర‌భుత్వం మండిప‌డుతోంది. తెలంగాణ మంత్రులు ఆది, సోమ‌వారాల్లో ప్ర‌ధానితోపాటు కేంద్ర మంత్రుల‌తో స‌మావేశానికి ప్ర‌య‌త్నాలు చేయ‌నున్నారు.

Next Story
Share it