Telugu Gateway
Telangana

ప్రజల ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యమా?

ప్రజల ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యమా?
X

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా రెండవ దశ ఉధృతంగా ఉన్న సమయంలో నోటిఫికేషన్ ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఎన్నికలు జరపాలని కోరినా కూడా ఆపే అధికారం ఎన్నికల సంఘానికి లేదా? అని ప్రశ్నించింది. ప్రజలు కరోనాతో చస్తుంటే ఎన్నికలు ముఖ్యమా? అసలు మీరు ఇక్కడ ఉన్నారా? ఆకాశంలో విహరిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధం వచ్చినా కూడా ఎన్నికలే ముఖ్యమా అని వ్యాఖ్యానించింది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్‌ఈసీ కోర్టుకు తెలపగా..ఎస్ఈసీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో కోవిడ్ రెండో దశ మొదలైతే.. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఎందుకిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఎన్నికల రోజైనా సరైన జాగ్రత్తలు తీసుకుని మిగిలిన ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Next Story
Share it