వైసీపీ ప్రభుత్వానిది విధాన ఉగ్రవాదం
ఏపీ సర్కారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. సినిమా టిక్కెట్ల వ్యవహారం ఇందుకు కారణమైంది. ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్ విధానం కోసం ఓ వెబ్ సైట్ ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. పారదర్శక విధానం కోసమే ఇది అని..పైగా సినిమా పరిశ్రమ కోరినందుకే ఈ పద్దతి తెస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తాము సినిమాలు చేస్తే ప్రభుత్వం టిక్కెట్లు అమ్మేది ఏంటి అంటూ మండిపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కొంత మంది నటులు తప్ప పరిశ్రమ మాత్రం దూరం ఉంటోంది.
అంతే కాదు..పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని..ఇవి వ్యక్తిగత అభిప్రాయాలు అంటూ చాంబర్ ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం నాడు కూడా పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది అని పేర్కొన్నారు.