Telugu Gateway
Politics

సంచలనం..రఘురామకృష్ణంరాజుకు గాయాలు నిజమే

సంచలనం..రఘురామకృష్ణంరాజుకు గాయాలు నిజమే
X

ఆర్మీ ఆస్పత్రి నివేదికను చదివి విన్పించిన న్యాయమూర్తి

సంచలనం. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కాలుకు గాయాలు అయినట్లు ఆస్పత్రి వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను సుప్రీం జడ్జి చదివి విన్పించారు. సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటీషన్ తోపాటు ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన నివేదిక పరిశీలన కూడా సాగింది. గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డులో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఎడిమాతోపాటు గాయాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.

అయితే ప్రభుత్వం తరపున వాదించిన లాయర్ దుష్వంత్ దవే మాత్రం ఆర్మీ ఆస్పత్రి నివేదికపై అనుమానాలు వ్యక్తం చేశారు. మెడికల్ బోర్డు రిపోర్టుకు...ఆర్మీ ఆస్పత్రి పరీక్షల మధ్య ఏదో జరిగిందని దవే అనుమానం వ్యక్తం చేశారు. ఆర్మీ ఆస్పత్రి నివేదిక తర్వాత రఘురామకృష్ణంరాజు తర్వాత లాయర్లు మాత్రం ఓ ఎంపీకి ఇలా జరిగితే మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అయితే బెయిల్ పిటీషన్లతోపాటు సీబీఐ విచారణ తదితర అంశాలపై వాదనను మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా పడింది.

Next Story
Share it