Telugu Gateway
Politics

వానాకాలం పంట వ‌దిలేసి యాసంగి గొడ‌వేంటి?

వానాకాలం పంట వ‌దిలేసి యాసంగి గొడ‌వేంటి?
X

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి కెసీఆర్ తీరుపై మండిప‌డ్డారు. వానాకాలం పంట కొన‌టం వ‌దిలేసి యాసంగి పంట గురించి ఇప్పుడు గొడ‌వ ఏంటి అని ప్ర‌శ్నించారు. రేవంత్ బుధ‌వారం నాడు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. కల్లాలలో రైతు కన్నీరు పెడుతుంటే.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ సేద తీరుతున్నాడన్నారు. కేసీఆర్ డిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేన‌న్నారు. ఈ తీర్థ యాత్రలతో రైతాంగానికి, తెలంగాణకు అయ్యేది, పొయ్యేది ఏమి లేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడన్నారు. రైతాంగానికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

త‌డిచిన ధాన్యం కొనుగోలుపై కెసీఆర్ త‌న వైఖ‌రి ఏంటో చెప్పాల‌ని రేవంత్ డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, అల‌స‌త్వం కార‌ణంగానే ధాన్యం త‌డిచి మొల‌క‌లు వ‌స్తున్నాయ‌ని ఆరోపించారు. సీఎం కెసీఆర్ గ‌తంలో కేంద్రానికి ఇచ్చిన లేఖే ఇప్పుడు రాష్ట్రానికి శాపంగా మారింద‌న్నారు. క‌ల్లాల్లోకి కాంగ్రెస్ సంద‌ర్భంగా రైతులు వెలిబుచ్చిన అభిప్రాయాల‌నే తాను ప్ర‌స్తావిస్తున్నాన‌ని తెలిపారు. రైతుల‌ను ఆదుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌త్వ‌ర‌మే మార్కెట్ జోక్య నిధి ఏర్పాటు చేయాల‌ని కోరారు. బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు రైతుల విశ్వాసాన్నికోల్పోయ‌న్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రైతుల త‌రపున గ‌ట్టిగా పోరాటం చేయ‌నుంద‌ని తెలిపారు.

Next Story
Share it