Telugu Gateway
Politics

కెటీఆర్ కు టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ బాధ్యతలు అందుకే

కెటీఆర్ కు టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ బాధ్యతలు అందుకే
X

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏమి నైపుణ్యం ఉందని సీఎం కెసీఆర్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ గా మంత్రి కెటీఆర్ ను పెట్టారని రేవంత్ ప్రశ్నించారు. ఆయన కరోనా బారిన పడి బయటకు రాగానే టాస్క్ ఫోర్స్ బాధ్యతలు అప్పగించారని అన్నారు. వేల కోట్ల రూపాయలతో కొనుగోలు చేయనున్న వ్యాక్సిన్లు, మందుల టెండర్ల కోసమే ఈ టాస్క్ ఫోర్స్ తప్ప..ఇందులో వైద్య రంగానికి చెందిన నిపుణుడు ఎవరూ లేరని రేవంత్ విమర్శించారు. దోపిడీకి ఆస్కారం ఉన్న ఏ శాఖ అయినా..టెండర్లు అయినా సరే కెసీఆర్ ఫ్యామిలీని దాటిపోకూడదనే తరహాలో నిర్ణయాలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. చూస్తుంటే ఈటెల రాజేందర్ ను తప్పించటానికి కారణం కూడా ఈ వేల కోట్ల రూపాయల టెండర్లను తమ చేతుల్లోకి తెచ్చుకోవటానికే అన్న అనుమానం వస్తుందని తెలిపారు. పేరుకు ఏదో అసైన్ మెం ట్ భూములు అని చెబుతున్నా..వ్యాక్సిన్లు..మందుల టెండర్లను తమ అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టేందుకే ఈ ప్లాన్ వేసినట్లు కన్పిస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ లో ఒక్క నిపుణుడు కూడా లేడు. కేటీఆర్,జయేశ్ రంజన్ అవిభక్త కవల పిల్లలు.టెండర్లు పిలిచే అవకాశం ఉంది కాబట్టే కేటీఆర్ టాస్క్ ఫోర్స్ కమిటీ లో ఉన్నారు. కరోనా కేసులు తగ్గించి చెప్పడం వల్ల రాష్ట్రానికి రావాలసిన వ్యాక్సిన్ లు కేంద్రం ఇవ్వలేదు.వ్యాక్సిన్ వేస్తే కరోనా రాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు..వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటి శక్తి పెరుగుతుంది..ఢిల్లీ ప్రభుత్వం వలస కార్మికులకు 5 వేల ఆర్థిక సహాయం చేస్తుంది.అడ్డామీది కూలీల కు ప్రతినెలా 5 వేల ఆర్థిక సహాయం తో పాటు,25కేజీ ల బియ్యం ఇవ్వాలి. కార్పోరేట్ ఆసుపత్రులను ప్రభుత్వం నియంత్రణ చేయాలి.ఇందులో 50శాతం పడకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధినంలోకి తీసుకోవాలి.రాష్ట్రంలో 23 మెడికల్ కాలేజీ లు ఉన్నాయి.. వీటంన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి." అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story
Share it