నర్సీపట్నం పులికి భయపడ్డ పులివెందుల పిల్లి
BY Admin19 Jun 2022 6:12 AM GMT

X
Admin19 Jun 2022 6:12 AM GMT
జగన్ సర్కారుపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి భయపడిందన్నారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగన్ గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో వరస పోస్టులు పెట్టారు.
ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి జడుసుకొని పిరికిపంద చర్యలు మొదలెట్టారని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడిపై వైసిపి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుందని వ్యాఖ్యానించారు.
Next Story