కిషన్ రెడ్డి సహాయ మంత్రా..నిస్సహాయ మంత్రా?
ప్రతిపక్షాల విమర్శలు ఇక భరించలేం
కాంగ్రెస్, బిజెపిలపై మంత్రి కెటీఆర్ ఫైర్
కాంగ్రెస్, బిజెపిలపై తెలంగాణ మున్సిపల్,ఐటి శాఖల మంత్రి కెటీఆర్ మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాలు అడిగిందే తడవుగా సాయం చేసిన ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు అలాగే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహాయ మంత్రా..నిస్సహాయ మంత్రా అని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు ప్రతిపక్షాల విమర్శలు భరించామని..ఇక భరించలేమని వ్యాఖ్యానించారు. కెటీఆర్ ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బిజెపి కార్యకర్తలకు కూడా సాయం అందించామని..సాయం తీసుకున్న వాళ్లు కూడా ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం సాయం చేయకపోయినా సీఎం కెసీఆర్ ను మరో వంద కోట్లు అడుగుతామని భాదితులు అందరికీ సాయం అందేలా చేస్తామన్నారు. ఎవరికి సాయం చేశామో తమ దగ్గర లెక్కలు ఉన్నాయని తెలిపారు. ' హైదరాబాద్ నగరంలో కురిసిన అసాధారణ వర్షానికి సీఎం తక్షణ సహయం కింద 550 కోట్లు సీఎం ప్రకటించారు.
50 కోట్లు రిపేర్ల కోసం--500 కోట్లు కుటుంబాలకు సహాయం ఇస్తున్నాము. 4లక్షల 30వేల కుటుంబాలకు ఇప్పటి వరకు తక్షణ సహాయం ప్రభుత్వం అందిస్తోంది.ఎలాంటి బేధాలు లేకుండా నష్టపోయిన కుటుంబాలకు మాత్రమే తక్షణ సహయం అందించాము. మేము వరద సహాయం చేస్తుంటే కాంగ్రెస్-బీజేపీ బురద రాజకీయం చేస్తున్నారు. మేము పుట్టెడు బాధల్లో ఉన్న ప్రజలకు అండగా ఉంటే- కాంగ్రెస్ బీజేపీ దుబ్బాక రాజకీయం చేశాయి. వరదలు వచ్చినప్పుడు ఎవరూ ప్రజల్లో లేరు- ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. జోనల్ కమిషనర్ ఆఫీస్ లకు వెళ్లి అధికారులను బెదిరించినట్లు మాట్లాడుతున్నారు.
ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు- దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. 15వ తేదీ అక్టోబర్ 8వేల కోట్లు వరదల వల్ల నష్టం జరిగిందని లేఖ రాస్తే ఇప్పటి వరకు స్పందన లేదు. కర్ణాటక సీఎం ఉత్తరం రాయగానే నాలుగు రోజుల్లో పీఎం 665 కోట్లు విడుదల చేశారు. గుజరాత్ కు ప్రధాని స్వయంగా వెళ్లి 5వందల కోట్లు విడుదల చేశారు. తెలంగాణ లో బీజేపీ కి 4గురు ఎంపీలు ఉన్నారు--ఒక్క పైసా తెలీదు మన నగరం మన బీజేపీ అంటారు. ఆరేళ్లలో 2లక్షల 72వేలు కడితే 1లక్ష 40వేలు హక్కుగా తెలంగాణకు వచ్చాయి. నాళాలు పై 28వేల ఆక్రమణలు ఉన్నాయి అని కిర్కోస్కర్ కమిటీ ఆనాడే చెప్పింది. జీహెచ్ఎంసీ బస్తీల్లో ప్రజలకు సుస్తీ చేస్తే దవాఖాన ఉండేదా? కనీసం టాయిలెట్స్ కట్టారా? ఇంకా వరద భాదితులు మిగిలితే నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది. ప్రజలు ఇంట్లోనే ఉండండి ఇంటికి వచ్చి అధికారులు తక్షిణసహయం అందిస్తారు. ' అని కెటీఆర్ తెలిపారు.