మేనిఫెస్టోపై చర్చ పెడదాం రా..అక్కడే ఉమాని కొడతా
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఘాటు విమర్శలు చేశారు. ఉమా ఎక్కడంటే అక్కడ రెండు పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు తాను రెడీ అని..ఆ చర్చలో ఉమాను కొట్టకపోతే రాష్ట్రం వదిలిపెట్టిపోతానని వ్యాఖ్యానించారు. దీక్షకు పోలీసులు ఒప్పుకోరని తెలిసే ఉమా కొత్త నాటకానికి తెరతీశారన్నారు. 'సొల్లు ఉమా సొల్లు కబుర్లు చెబుతాడు. బహిరంగ చర్చకు సిద్ధమని రాత్రి నుంచి ఉమకు 10 సార్లు ఫోన్ చేశాను. ఉమతో ఎలాంటి చర్చకైనా నేను సిద్ధంగానే ఉన్నాను. నేను చర్చకు రమ్మంటే దేవినేని నాటకాలాడుతున్నాడు' అని నాని మరోసారి సవాల్ విసిరారు.
'దేవినేని ఉమా.. నీకంటే బ్రోకర్లు ఎవరైనా ఉన్నారా.. వదిన్ని చంపి శాసనసభ్యుడవయ్యావు. నేను రాజకీయాల్లో లేకుంటే నిన్ను చెప్పు తీసుకుని కొట్టేవాడిని. మంచి మర్యాద లేకుండా జగన్‌పై నోరు పారేసుకుంటే నా చేతుల్లోనో, కేపీ చేతుల్లోనో, వంశీ చేతుల్లోనే తన్నులు తినక తప్పదు. ప్రెస్‌మీట్‌లు పెట్టి కుక్కలా మొరుగుతావు.. నేరుగా ఫోన్ చేసి తిడితే మాట్లాడవు. నీఇంట్లోనైనా చర్చకు వస్తా. చంద్రబాబు ఏం చేశాడో, జగన్ ఏం చేశాడో తేల్చుకుందాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే.. నా సవాల్ స్వీకరించు. పిచ్చి వాగుడు మానకుంటే నీ ఇంటికొచ్చి బడిత పూజ చేయకుంటే నాపేరు కొడాలి నానినే కాదు' అని నాని సవాల్ విసిరారు.