Telugu Gateway
Politics

ట్విట్టర్ కూడా నాపై కుట్ర చేస్తోంది

ట్విట్టర్ కూడా నాపై కుట్ర చేస్తోంది
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ మీడియా, ట్విట్టర్ పై మరోసారి మండిపడ్డారు. దేశంలో ఓ వర్గం మీడియా తనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ట్విటర్‌ కూడా తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 'ట్రెండింగ్‌లో లేని విషయాన్ని కూడా ఉన్నట్లు చూపుతోంది. అసలు ట్రెండ్ అయ్యే అంశాన్ని మాత్రం పట్టించుకోదు. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న విషయం అందరికీ తెలుసు. బైడెన్ తదుపరి అధ్యక్షుడని ఎలక్టోరల్ కాలేజి ధ్రువీకరిస్తే అప్పుడు వైట్‌హౌస్ ఖాళీ చేస్తా'అంటూ ట్రంప్ తాజాగా ట్వీట్‌ చేశారు. దేశంలోని 99శాతం మంది ప్రజలు తన ఓటమని అంగీకరించడంలేదని ప్రజల తీర్పునకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు బైడెన్‌ మాత్రం రాబోయే తన ప్రభుత్వంలో కీలక విభాగాలకు అధిపతులను నియమిస్తున్నారు. అమెరికాను అభివృద్ధి వైపు నడిపిస్తానంటూ తన టీమ్‌ను సిద్ధ చేసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్‌ను ఎంచున్నారు మరోవైపు జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు బైడెన్‌ సిద్ధం అయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 8 కోట్లపై చిలుకు ఓట్లతో గెలిచిన తొలి ప్రెసిడెన్షియల్‌ క్యాండిడేట్‌గా జోబైడెన్‌ చరిత్ర సృష్టించారు.

Next Story
Share it