Telugu Gateway
Politics

రఘురామకృష్ణంరాజు కుట్ర వెనక చంద్రబాబు

రఘురామకృష్ణంరాజు కుట్ర వెనక చంద్రబాబు
X

వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, బాలశౌరిలు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుట్ర వెనక ఉన్నది చంద్రబాబునాయుడే అని మిథున్ రెడ్డి ఆరోపించారు. ఇది అంతా పక్కా ప్రణాళికతోనే సాగిందని..గతంలో శంకర్ రావుతో కోర్టులో ఫిర్యాదు చేయించినట్లే..ఇప్పుడు రఘురామకృష్ణంరాజును అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అందుకు ప్రతిఫలంగా రఘురామకృష్ణంరాజుపై ఉన్న సీబీఐ కేసుల్లో సాయం చేసేందుకు బిజెపితో కలసి పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు టీడీపీ నుంచి బిజెపిలో చేరిన ఎంపీలను వాడుకుంటున్నారని..వీరి చేరిందే అందుకే అంటూ విమర్శలు చేశారు. మిథున్ రెడ్డి సోమవారం నాడు తాడేపల్లిలో పార్టీ ఎంపీలతో కలసి మీడియాతో మాట్లాడారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.

చివరకు రఘురామకృష్ణంరాజు కుటుంబసభ్యులను కూడా పావులుగా వాడుకుంటున్నారు. ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్డ్‌ చేసేందుకు యత్నిస్తున్నారు'' అని విమర్శించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, దూళిపాళ నరేంద్ర అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంత హడావుడి చేయని చంద్రబాబు రాఘురామకృష్ణంరాజు అరెస్ట్ విషయంలో చేస్తున్న హడావుడి..రాస్తున్న లేఖలతోనే ఆయన పాత్ర అర్ధం అవుందని అన్నారు. పోలీసులు కొట్టలేదని వైద్య బృందమే కోర్టుకు నివేదిక ఇచ్చిందన్న మిథున్‌రెడ్డి.. కేవలం రమేష్‌ ఆస్పత్రిలోనే ట్రీట్‌మెంట్‌ జరగాలనడం సరికాదని పేర్కొన్నారు.

వైసీపీలో ఓసీలే పదవులు తమకు సరిగా రావటం లేదని అడగాల్సి ఉంటుందని...ఇతరులకే పదవులు ఎక్కువగా ఇస్తున్నారని..దీని కోసం ఏకంగా జగన్ అసెంబ్లీలో కూడా చట్టం చేశారని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీ కాకముందే రఘురామకృష్ణరాజు ఐదుసార్లు పార్టీ మారారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బాలశౌరి అన్నారు. పార్టీలో రఘురామకృష్ణరాజుకు సముచితస్థానం ఇచ్చామని, అయినప్పటికీ సీఎం, మంత్రులపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని, పోలీసులు కొట్టారంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

Next Story
Share it