Top
Telugu Gateway

పాస్ పోర్టుల బ్రోకర్ సీఎం అయితే ఇలాగే ఉంటది

పాస్ పోర్టుల బ్రోకర్ సీఎం అయితే ఇలాగే ఉంటది
X

కెసీఆర్ ..చార్మినార్ బాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా?. బండి సంజయ్

ముఖ్యమంత్రి కెసీఆర్ పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం హోదాలో ఉండి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పాస్ పోర్టుల బ్రోకర్..దొంగ పాస్ పోర్టులు ఇప్పించిన వ్యక్తి సీఎం అయితే ఇలాగే ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోర్జరీ చేసిన సంతకంతో తాను వరద సాయం ఆపినట్లు ప్రచారం చేయటంపై మండిపడ్డారు. కెసీఆర్ పాస్ పోర్టు బ్రోకర్ అని తాను చెప్పటం కాదని..కాంగ్రెస్ సీనియర్ ఎం. సత్యనారాయణ రావు చెప్పారని వ్యాఖ్యానించారు. వరద సాయాన్ని బీజేపీనే ఆపించిందని చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయంలో కేసీఆర్ ప్రమాణం చేయాలన్నారు.

అలాగే వరద సాయాన్ని బీజేపీ ఆపించలేదని భాగ్యలక్ష్మీ దేవాలయంలో తాను కూడా ప్రమాణం చేస్తానని బండి సంజయ్ సవాల్ విసిరారు. వరద సాయాన్ని ఆపాలని ఎస్ఈసీకి తాను లేఖ రాయలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీనే ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. వరద సాయం బీజేపీ ఆపిందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. క్యూలో నిలుచున్న మహిళ మరణించడం ప్రభుత్వ హత్యేనని తెలిపారు. కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో దేశ ప్రజలు మర్చిపోలేదున్నారు. తెలంగాణలోనే ఏమి చేయలేని కేసీఆర్‌.. ఇక ఢిల్లీలో ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు.

Next Story
Share it