Telugu Gateway
Politics

కెసీఆర్ ఆస్తుల ల‌క్ష రెట్లు పెరిగాయి

కెసీఆర్ ఆస్తుల ల‌క్ష రెట్లు పెరిగాయి
X

ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై తెలంగాణా బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014 నుంచి చూస్తే సీఎం కెసీఆర్ ఆస్తులు ల‌క్ష రెట్లు పెరిగాయన్నారు. దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా సీఎం కెసీఆర్ కు పేరుంద‌ని అన్నారు. బండి సంజ‌య్ సీఎం కెసీఆర్ కు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్ళు, భూముల వేలంలో భారీ ఎత్తున అవినీతి సాగింద‌ని ఆరోపించారు. ఇసుక‌, లిక్క‌ర్, డ్ర‌గ్స్ దందాలు, భూక‌బ్జాల‌కు సీఎం కుటుంబ స‌భ్యులు, టీఆర్ఎస్ నేత‌ల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని నిరూపించ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. వీటిపై స్వ‌తంత్ర సంస్థ‌తో ద‌ర్యాప్తు జ‌రిపించాల‌న్నారు. ఇత‌ర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌ను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసి ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హ‌స్యం చేశార‌ని విమ‌ర్శించారు. బంగారు తెలంగాణ తెస్తామ‌ని చెప్పి అక్ర‌మ మార్గాల ద్వారా కోట్ల రూపాయ‌లు దోచుకున్నారన్నారు. త‌న భాషకు గురువు కేసీఆరే.. కేసీఆర్‌ను గద్దె దించేదాక భాష మార్చుకోనని చెప్పారు.ప్ర‌స్తుతం ప్ర‌జాసంగ్రామ యాత్ర చేస్తున్న సంజ‌య్ ప‌లు స‌భ‌ల్లో మాట్లాడారు. వరి వేస్తే ఉరి అని చెబుతున్న కేసీఆర్‌కు వరి కొనం అని ఎవరు చెప్పారు? బండి సంజయ్ ప్రశ్నించారు.

పండించిన ప్రతి గింజ కొంటమన్న కేసీఆర్.. ఇప్పుడు నేపాన్ని కేంద్రంపై నెడుతున్నారని త‌ప్పుప‌ట్టారు. రైతులను భయపెడుతున్న కేసీఆర్.. ఐదుగురు రైతుల మృతికి కారణమ‌య్యార‌న్నారు. రైతులకు, బియ్యానికి ఏం సంబంధం.. రైతులు అమ్మేది వడ్లన్నారు. రైతులు ఎవరూ భయపడొద్దు.. పండించిన ప్రతి గింజను కేసీఆర్ చేత కొనిపిస్తాం.. కేంద్రంతో కొనిచ్చే భాద్యత తనదన్నారు. రాష్త్రంలో నకిలీ విత్తనాలు అమ్మేది కేసీఆర్ సన్నిహితులేనని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక్క రైతు బంధు ఇచ్చి మిగితావన్ని బంద్ చేశారని చెప్పారు. తెలంగాణ‌లో నిరుద్యోగ భృతికి దిక్కులేదని, ఉద్యోగులకు జీతాలు లేవన్నారు. ఆనాడు ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకుంటే.. ఈ రోజు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Next Story
Share it