Telugu Gateway
Politics

సీఎంపై ఇస్టానుసారం మాట్లాడటం సరికాదు

సీఎంపై ఇస్టానుసారం మాట్లాడటం సరికాదు
X

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆయన్ను అరెస్ట్‌ చేయటంలో ఎలాంటి తప్పులేదన్నారు. ఈ పని ఎప్పుడో చేయాల్సిందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, సీఎంను ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తే ప్రజలు సహించరని అన్నారు. రఘురామకృష్ణంరాజు లాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోంధన్నారు.

తన నియోజకవర్గానికి వెళ్లి అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీ ఎక్కడో ఉండి తన ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడం సరైంది కాదన్నారు. ఇదిలా ఉంటే రఘురామకృష్ణరాజుపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మరో మంత్రి శ్రీరంగనాథరాజు కోరారు.

Next Story
Share it