Top
Telugu Gateway

పేదల రక్తం పీలుస్తున్న జగన్

పేదల రక్తం పీలుస్తున్న జగన్
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జగన్ పేదల రక్తాన్ని జలగ పీల్చినట్లు పీల్చేస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన రాబడి మొత్తం జే గ్యాంగ్ జేబుల్లోకి పోతోంది. పేదలపై యధేచ్చగా పన్నుల మోత, సుంకాల భారం మోపుతున్నారు. ఏడాదిన్నరలోనే పన్నులు, ఛార్జీల పెంపు ద్వారా రూ70వేల కోట్ల భారాలు మోపారు. పట్టణ భూముల విలువ పెంపుతో ప్రజలపై రూ.800కోట్ల భారం పడనుంది. ఆస్తిపన్ను 15శాతం పెంపుతో రూ.8వేల కోట్ల భారం పడుతుంది. సీఎన్జీపై 10శాతం వ్యాట్ పెంచి రూ.300కోట్ల భారం మోపారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టానుసారం పెంచి 1800కోట్ల భారం వేశారు.

దొడ్డిదారిన విద్యుల్ బిల్లులు పెంచి 3వేల కోట్ల భారం మోపారు. యూజర్ ఛార్జీల పెంపుతో రూ.2400కోట్ల భారం మోపారు. రవాణా పన్నులు పెంపుతో రూ.400కోట్ల భారం. నిత్యావసరాల ధరలు 200% నుంచి 300% పెంచేశారు. మద్యం రేట్లు 200%, 300% పెంచారు, రూ 9వేల కోట్ల భారం మోపారు. ఇసుక దోపిడిలో జె గ్యాంగ్ రూ 18వేల కోట్లు కొల్లగొట్టారు. మద్యం మాఫియాతో రూ 25వేల కోట్ల దోపిడి. మైనింగ్ మాఫియాతో రూ 30వేల కోట్ల దోపిడి. సిమెంట్ సిండికేట్ తో రూ 15వేల కోట్ల దోపిడి. ఇళ్లస్థలాలకు భూసేకరణలో రూ4వేల కోట్ల దోపిడి. ల్యాండ్ లెవలింగ్ ముసుగులో మరో రూ2వేల కోట్ల దోపిడి.' అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

Next Story
Share it