Telugu Gateway
Andhra Pradesh

రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటీషన్ డిస్మిస్

రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటీషన్ డిస్మిస్
X

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో షాక్. ఆయన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. రఘురామకృష్ణంరాజును శుక్రవారం నాడు ఏపీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే...రాత్రి బెయిల్ కోసం హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ కోసం లోయర్ కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేసు తీవ్రత దృష్ట్యా రావాల్సి వచ్చిందని రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే బెయిల్ పిటీషన్ ను డిస్మస్ చేసిన న్యాయమూర్తి సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

అయితే ఆయన అనారోగ్యం అంశాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. తాను ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నానని..దీంతోపాటు సీఎం జగన్ బెయిల్ రద్దు కోసం సీబీఐ కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశానని బెయిల్ పిటీషన్ లో పేర్కొన్నారు. అందుకే తనపై కక్ష కట్టి అరెస్ట్ చేశారని..సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని తెలిపారు. అయినా రఘరామకృష్ణంరాజు తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించని హైకోర్టు బెయిల్ పిటీషన్ ను డిస్మస్ చేసింది.

Next Story
Share it