Telugu Gateway
Andhra Pradesh

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రఘురామకృష్ణంరాజు

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రఘురామకృష్ణంరాజు
X

ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా అటువైపే. రఘరామకృష్ణంరాజు దేశ రాజధాని ఢిల్లికి బయలుదేరి వెళ్లారు. ఆయనపై ఏపీలో పలు కేసులు నమోదు అయి ఉన్నాయి. మళ్లీ ఏదైనా కొత్త కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే అనుమానంతోనే ఆయన ఆస్పత్రి నుంచే నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే నమోదు అయిన కేసులో ఏపీ సీఐడీకి సహకరించాలని కోర్టు ఆదేశించంది. విచారణకు 24 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

రఘురామకృష్ణంరాజు బుధవారం సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈనెల 24న ఆయన తరఫున న్యాయవాదులు. గుంటూరు సీఐడీ కోర్టులో పూచీకత్తు సమర్పించారు.ఈ సందర్భంగా రఘురామరాజు ఆరోగ్య పరిస్థితిపై మెజిస్ట్రేట్ ఆరా తీసినట్లు లాయర్లు తెలిపారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి పూర్తి వివరాలతో డిశ్చార్జ్ సమ్మరీని ఇవ్వాలని సూచించారు. దీంతో ఆర్మీ ఆసుపత్రి వర్గాలుడిశ్చార్జ్‌ సమ్మరి ఇవ్వడంతో న్యాయవాదులు దాన్ని గుంటూరు సీఐడీ కోర్టుకు అందజేశారు దీంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

Next Story
Share it