ఏపీ సర్కారు తేనీటి విందులో సీజెఐ రమణ, సీఎం జగన్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ. ఏపీ ముఖ్యమంత్రి జగన్. వీరిద్దరూ ఒకే ఫ్రేములో. నిజంగా ఇది పిక్ ఆఫ్ ద డేనే. గత రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న సీజెఐ రమణకు ఏపీ ప్రభుత్వం విజయవాడలో శనివారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చింది. ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐకు ఇచ్చిన తేనీటీ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ ఎన్వీ రమణకు సీఎం వైఎస్ జగన్ దంపతులు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్ జస్టిస్‌లు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు. అంతకుముందు నోవాటెల్ హోటల్‌లో సీజేఐ ఎన్వీ రమణను సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు.