Telugu Gateway
Andhra Pradesh

విశాఖ మ‌ధుర‌వాడ‌లో అదానీ సెంట‌ర్ కు 130 ఎక‌రాలు

విశాఖ మ‌ధుర‌వాడ‌లో అదానీ సెంట‌ర్ కు 130 ఎక‌రాలు
X

ఏపీ మంత్రి వ‌ర్గం గురువారం నాడు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల విక్ర‌యానికి వీలుగా సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్ట స‌వ‌ర‌ణ ఆర్డినెన్స్ కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ప‌న్ను ఎగ‌వేత లేకుండా చేయ‌టంతోపాటు పార‌ద‌ర్శ‌క విధానం కోస‌మే ఆన్ లైన్ టి్కెటింగ్ వ్య‌వ‌స్థ అని ప్ర‌భుత్వం చెబుతోంది. విశాఖ‌ప‌ట్నంలోని మ‌ధుర‌వాడ‌లో అదానీ సంస్థ‌కు 130 ఎకరాలు కేటాయించ‌నున్నారు. దీంతోపాటు శారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాలు కేటాయింపుకు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. సీఎం జ‌గ‌న్ అధ్యక్షతన స‌చివాల‌యంలో జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ నిర్ణ‌యాలు తీసుకున్నారు. మంత్రివ‌ర్గ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి అన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. అర్హత ఉన్నవారందరికీ సంక్షేమపథకాలు అందిస్తామ‌ని తెలిపారు. అంతేకాక బీసీ జనగణన చేసేలా అసెంబ్లీలో తీర్మానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపామన్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించామన్నారు.

కేబినెట్‌లో భేటీలో ఆమోదించిన పలు ఇత‌ర అంశాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 'అమ్మఒడి పథకానికి అర్హత ఉన్న వారందరికీ జూన్‌, డిసెంబర్‌లో అర్జీకి అవకాశం కల్పిస్తాం. వైద్య, విద్య, కుటుంబ సంక్షేమశాఖలో ఉద్యోగాలకు ఆమోదం. కొత్తగా 1,285 ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ అంగీకారం.560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో ఫార్మాసిస్టుల పోస్టుల భర్తీకి ఆమోదం. వైద్య కళాశాలల్లో 2,190 ఉద్యోగాల భర్తీకి ఆమోదం.ఇప్పటి వరకు మొత్తం 4,035 కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం. వైద్య ఆరోగ్యశాఖలో 41,308 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఉంటే.. ఇప్పటివరకు 26,197 ఉద్యోగాలు భర్తీ చేశాం. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం.అనంతపురం జిల్లాలో వేదపాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటుకు ఆమోదం. రాష్ట్రంలో 5చోట్ల సెవన్‌ స్టార్‌ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం.ప్రకాశం జిల్లాలో జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీలకు ఆమోదం.' తెలిపారు.

Next Story
Share it