ఎస్ యూవీల అమ్మకాలు రికార్డు

Update: 2023-11-29 05:02 GMT

పండగల సీజన్ లో కొత్త కార్లు ..కొత్త కొత్త ఫోన్లు కొనటం చాలా మందికి అలవాటు. ఈ సీజన్ ను టార్గెట్ చేసుకుని కంపెనీ లు కూడా పలు ఆఫర్లతో ముందుకు వస్తాయి. ఎక్కువ మందిని తమ వైపు తిప్పుకోవటం కోసం ఆకర్షణీయ ప్రకటనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఈ పండగ సీజన్ లో అంటే కేవలం 42 రోజుల్లో ఏకంగా 38 లక్షల వాహనాలు అమ్ముడు పోయాయి. అంటే రోజుకు 90300 వాహనాల విక్రయాలు సాగినట్లు ఫెడరేషన్ అఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) వెల్లడించింది. గత ఏడాది పండగల సీజన్ తో పోలిస్తే ఈ సంవత్సరం వాహనాల అమ్మకాలు 19 శాతం మేర పెరిగాయి. భారత్ లో పండగల సీజన్ అంటే నవరాత్రుల మొదటి రోజు నుంచి దంతెరస్ ముగిసిన పదిహేను రోజులకు ముగుస్తుంది. అంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 25 వరకు కొనసాగింది. ఈ సీజన్ లో అమ్ముడు అయినా అధిక వాహనాల్లో ఎస్ యువీలదే అగ్రస్థానం. ఈ సారి పండగల సీజన్ లో రికార్డు అమ్మకాలు జరిగిన కూడా ఆటోమొబైల్ కంపెనీల దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు నిల్వ ఉన్నాయి.

Tags:    

Similar News