వై ఎస్ షర్మిల దీక్ష విరమణ

Update: 2021-04-18 12:44 GMT

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కెసీఆర్ నిరుద్యోగులను బలితీసుకుంటున్నారని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు క్పలిస్తామన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ షర్మిల దీక్షకు దిగిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఒక రోజు దీక్షకే అనుమతి ఇవ్వటంతో షర్మిల తలపెట్టిన 72 గంటల దీక్షను లోటస్ పాండ్ లో పూర్తి చేశారు. తెలంగాణలో నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు.

నిరుద్యోగ, అమరవీరుల కుటుంబ సభ్యులు షర్మిలతో దీక్ష విరమింపజేశారు. దీక్ష విరమణకు ముందు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. షుగర్‌ లెవల్స్‌ 88 నుంచి 62కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గినట్లు వెల్లడించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు వచ్చేవరకూ నియోజకవర్గాల్లో తమ కార్యకర్తలు దీక్షలు చేస్తారని షర్మిల వెల్లడించారు. రెండేళ్లలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని..ఏమి చేసైనా సరే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని వెల్లడించారు. జులై8న తన కొత్త పార్టీని ప్రకటించనున్నారు.

Tags:    

Similar News