ఢిల్లీ లో తెలంగాణ సర్కారు!

Update: 2022-12-13 12:44 GMT

తెలంగాణ పాలన ఒక రెండు మూడు రోజులు ఢిల్లీ నుంచే సాగేలా కనిపిస్తోంది. ఎందుకు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అక్కడే మకాం వేయనున్నారు. సిఎం చాలా సార్లు ఢిల్లీ వెళతారు...అది కొత్తేమి కాదు. ఇప్పుడు సీఎం తో పాటు అయన కాబినెట్ లోని చాలా మంది మంత్రులు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. అదే ఇప్పుడు కీలకం. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఒకేసారి ఢిల్లీ లో ఉండటం చాలా అరుదైన విషయం. ఎందుకు అంటే టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత ఢిల్లీ కేంద్రంగా కార్యాలయం తెరవటం..అక్కడ కెసిఆర్ నిర్వహిస్తున్న యాగంలో పాల్గొనేందుకు అంతా బయలుదేరి ఢిల్లీ వెళ్లారు.

మంగళవారం నాడు ఇవే ఫోటోలు మీడియా గ్రూపుల్లో హల్చల్ చేశాయి. కెసిఆర్ ఢిల్లీ టూర్ కంటే ముందే వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటు మరికొంత మంది ఢిల్లీ చేరుకొని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు తెలంగాణ మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు , శ్రీనివాస గౌడ్, గంగుల కమలాకర్ లు ఢిల్లీ బాట పట్టారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే చాలా మంది ఢిల్లీ వెళ్లారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కూడా మరి కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.బుధవారం నాడు కెసిఆర్ ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రాంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బీహార్ ఉప ముఖ్య మంత్రి తేజస్వి యాదవ్, రైతు నేత రాకేష్ టికాయత్ తదితరులు హాజరుఅవుతారని చెపుతున్నారు.

Tags:    

Similar News