తెలంగాణ ప్రజ‌లు పిలిస్తేనే ఇక్కడ‌కు వ‌స్తా

Update: 2021-10-09 13:38 GMT

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న శ‌నివారం నాడు తెలంగాణ ప్రాంతానికి చెందిన క్రియాశీల జ‌న‌సైనికుల‌తో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సమస్యలపై పోరాడే వారిని అసెంబ్లీకి పంపించటానికి కృషి చేస్తానని ప్రకటించారు. తెలంగాణ పోరాట స్పూర్తి జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని అన్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమని పవన్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు తనను పిలిచే వరకు ఇక్కడకు రానని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై నుంచే జనసేన పార్టీని ప్రారంబించానని గుర్తుచేశారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి తన గుండెలో ధైర్యాన్ని నింపిందని తెలిపారుతెలంగాణ భాషను, యాసను తాను గౌరవిస్తున్నానని తెలిపారు.

అడుగుపెడితేనే అనుభవం రాదని వ్యాఖ్యానించారు. తలకాయ ఎగిరిపోతుందా.. ఓడిపోతామా.. గెలుస్తామా అని ఆలోచించలేదన్నారు. కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోతాయని, కులాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. కులాల కొట్లాటతో ఏపీ అభివృద్ధి దిగజారిపోయిందన్నారు. దౌర్జన్యం, అవినీతి, పేదరికమే జనసేనకకు బద్దశత్రువులని పేర్కొన్నారు. ఆంధ్ర పాలకులను తెలంగాణ నాయకులు బద్దశత్రువులుగా చూశారని విమర్శించారు. ఏపీలో వైసీపీ నాయకులు తనకు శత్రువులు కాదని, సమస్యలు మాత్రమే శత్రువలని పేర్కొన్నారు. ఏ మతంపై దాడి జరిగినా ఖండిస్తానని పవన్‌కల్యాణ్ ప్రకటించారు.

Tags:    

Similar News