సాగర్..ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం

Update: 2021-02-07 12:17 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ పార్టీ నేతలకు పలు అంశాలపై పార్టీ నేతలకు దిశా, నిర్దేశం చేశారు. ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అంశాలపై కూడా స్పందించారు. అదే సమయంలో పార్టీ సభ్యత్వం, ప్లీనరీ సమావేశాల నిర్వహణ అంశాలపై స్పష్టత ఇచ్చారు. ఈ నెల 12 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, మార్చి 1 నుంచి పార్టీ కమిటీల నియామకం జరుగుతుందని కేసీఆర్ వెల్లడించారు. ఏప్రిల్‌లో లక్షలాది మందితో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎవరూ పోటీ లేరని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే చాలు విజయం టీఆర్‌ఎస్‌దే అని తెలిపారు. ఈ నెల 11న గెలిచిన కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు రావాలని సూచించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు సంబంధించి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీల్డ్‌ కవర్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లను పంపిస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. వారినే టీఆర్ఎస్ తరపున గెలిచిన వారు మద్దతు ఇవ్వాలన్నారు.

Tags:    

Similar News