టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిన ఈటెల రాజేందర్ వ్యవహారంపై మావోయిస్టు పార్టీ స్పందించింది. కెసీఆర్, ఈటెల గొడవ ప్రజలకు సంబంధించింది ఏ మాత్రం కాదు అని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. వీరిద్దరూ ఒకే గూటి పక్షులు అని వ్యాఖ్యానించింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదల అయిన లేఖలోని ముఖ్యాంశాలు..''కేసీఆర్- ఈటల మధ్య వ్యవహారం తెలంగాణ ప్రజలకు సంబంధించినది కాదు. కేసీఆర్, ఈటల రాజేందర్ ఒకే గూటి పక్షులు. ప్రజల ఆకాంక్షలకు కేసీఆర్, ఈటల తూట్లు పొడిచారు. ఈటల తన ఆస్తుల పెంపుదల కోసం ప్రయత్నించారు. పేదల భూములను ఈటల అక్రమంగా ఆక్రమించారు'' అని జగన్ ఆరోపించారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తానని చెప్పిన ఈటల.. తన ఆస్తుల రక్షణ కోసం బీజేపీలో చేరారంటూ విమర్శించారు. సామ్రాజ్యవాద దళారి నిరంకుశ పెట్టుబడిదారీ విధానానికి భూస్వామ్య వర్గాల కు అనుకూలంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల పునర్నిర్మాణం మార్చారు.మొన్నటి వరకు కెసిఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటెల తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించాడు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించాడు.కెసిఆర్ బర్రెలు తినేవాడు అయితే ఈటెల రాజేందర్ గొర్రెలు తినే ఆచరణ కొనసాగించాడు.
తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాం అని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసం నేడు బిజెపిలో చేరారు.ఆర్ ఎస్ యు మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం గా మా పార్టీ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుంది.ఈటెల తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారు.బిజెపి హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో విశాల ప్రజలు ఐక్యమై పోరాడుతున్నారు అలాగే కెసిఆర్ నియంత పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారుష అని పేర్కొన్నారు.