తెలంగాణలోనూ కాంగ్రెస్ దే విజయం

Update: 2023-05-13 12:01 GMT

కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై ఏఐసీసీ కాంగ్రెస్ కర్ణాటక బాధ్యులు, ఎమ్మెల్యే దుద్ధిల్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఫలితాల వెల్లడి అనంతరం అయన మీడియా తో మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ పార్టీ సమిష్టి విజయం అన్నారు. కచ్చితంగా ఇవే ఫలితాలు రేపు తెలంగాణ లో ఉండబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ తో విశేష స్పందన వస్తుంది అని , ఎన్ని విద్వేష రాజకీయాలు చేసిన ప్రజలు న్యాయం పక్షాన నిలిచారు అని తెలిపారు. కర్ణాటక తరహా తీర్పు దేశం అంతటా ఉండబోతుంది అని శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల సమయంలో శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషించారు. 



Tags:    

Similar News