ఆ వీడియో లో చిరు కామెంట్స్ ఇలా ఉన్నాయి. ‘వెయ్యి ఎలకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లుగా ఈ రోజు అయన కాశీలోని పోటీ చేస్తున్నారు. అయన విషయం తెలియంది కాదు. అయన హిట్లర్ అని అన్నాను. మరో సారి ఆ మాట అనటానికి వెనకంజ వేయను. నియంత. భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీలో ఏ ఒక్కరి ప్రాతినిధ్యం లేకుండా ఒక మోడీ ..ఒక కమలం ఫొటోతో బీజేపీ కి ఓటు వేయండి అని చెపుతున్నారు. ఇది చూస్తుంటే ఇదీ మోడీ తత్వం..హిట్లర్ తత్వం తప్ప మరొకటి కాదు. అలాంటి వ్యక్తులతో ఎలాంటి ప్రమాదం ఉందో అర్ధం చేసుకోవచ్చు. భవిష్యత్తులో అయన ఎవరిని కనపడనీయకుండా చేస్తారు. అద్వానీ లాంటి మనిషి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనోహర్ జోషి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాగే జస్వంత్ సిన్హా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది నేను చెప్పటం కాదు...మీరు ..మీడియా మాకు చెప్పింది. అలాంటి మనిషి నిజంగా వస్తే కనుక వాళ్ళ లీడర్స్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు...రేపు ప్రజలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇవి అన్ని ఏంటి అంటే మోడీ కి నేరుగా , పరోక్షంగా ఎవరైతే మద్దతు ఇస్తున్నారో అలాంటి వాళ్ళు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ’ అంటూ కామెంట్స్ చేశారు.