జమిలి ఎన్నికలకు ఛాన్స్..రెడీగా ఉండాలి

Update: 2020-12-06 13:31 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ ఆదివారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. పలు అంశాలపై ఆయన వీరికి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని..దీనికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ కూడా ఆదివారం నాడే 2023 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు కెటీఆర్ కూడా జమిలి ఎన్నికలపై మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్పందిస్తూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అభివృద్ధి చేస్తూ ముందుకెళ్లాలని వ్యాఖ్యానించారు. ''గ్రేటర్‌లో మన ప్రయత్న లోపం లేదు.. ఎమోషన్ ఎలక్షన్ జరిగింది. సిట్టింగ్‌లను మార్చిన చోట టీఆర్ఎస్ గెలిచింది. సిట్టింగ్‌లను మార్చని చోట ఓడిపోయాం.. ఇక్కడే లెక్క తప్పింది. గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందామని'' ఆయన పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నారు.

Tags:    

Similar News