రష్మిక పై మహా మాజీ మంత్రి విమర్శలు

Update: 2024-05-19 03:45 GMT

Full Viewషూటింగ్ కు ముందు నిజాలు తెలుసుకోండి అంటూ హీరోయిన్ రష్మిక మందన్న పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నేత ఆదిత్య ఠాక్రే. ఇటీవల ఆమె ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్ట్ పై చేసిన వీడియో పెద్ద దుమారమే రేపింది. ఈ వీడియో చేసినందుకు ఆమె కు డబ్బులు ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ..సడన్ గా ఆమె ప్రస్తుత ప్రభుత్వం కోసం ప్రచారం చేయటం ఆశ్చర్యం కలిగించింది అన్నారు. ఈ మేరకు ఉద్దవ్ ఠాక్రే ఎక్స్ వేదికగా పలు విషయాలు ప్రస్తావించారు. అటల్ సేతు ప్రాజెక్ట్ పనుల్లో 85 శాతం పూర్తి చేసింది అని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం చేసింది కేవలం 15 శాతం పనులే అన్నారు. ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత కూడా విఐపీ సమయం దొరక్క మూడు నెలలు ఆలస్యంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు అని ఆరోపించారు.

                          రష్మిక అబివృద్దికి ఓటు వేయాలని చెపుతున్నారు అని...దీని అర్ధం బీజేపీ ఓటు వేయవద్దు అని చెప్పారన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే 85 పనులు పూర్తి చేసినందున ఈ క్రెడిట్ తమకే దక్కుతుంది అన్నట్లు ఆదిత్య ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. మరో వైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేసినందుకు రష్మిక పది కోట్ల రూపాయలు తీసుకున్నారు అంటూ సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయం మాత్రం ఎక్కడ నిర్దారణ కాలేదు అనే చెప్పాలి. అయితే రష్మిక వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా పెయిడ్ ప్రమోషన్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News