కొత్త కొత్త దర్శకులు టాలీవుడ్ లో కొత్త కొత్త ప్రయాగాలు చేస్తున్నారు. అయితే అందులో ఏది హిట్ అవుతుంది...ఏది ఫట్ అంటుందో చెప్పటం కష్టం. పరిశ్రమలో కొత్త ప్రయోగాలు కావాలి అని చాలామంది కోరుతున్నారు కూడా. అయితే ఇందులో కొన్ని సో సో గా మిగిలిపోతున్నాయి. ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరూపాక్ష సినిమా రోడ్ యాక్సిడెంట్ తర్వాత హీరో సాయిధరమ్ తేజ్ చేసిన తొలి సినిమా కావటం..దీనికి తోడు ప్రముఖ దర్శకుడు సుకుమార్ దీనికి స్క్రీన్ ప్లే అందించటం తో ఈ మూవీ పై అందరి దృష్టి పడింది. ఈ సినిమా స్కోప్ కూడా చాలా పరిమితంగానే ఉంది. కథ అంతా రుద్రవనం అనే ఊరు చుట్టూనే తిరుగుతుంది. ఆ ఊర్లో వరసగా మరణాలు చోటు చేసుకుంటుండంతో అక్కడి ప్రజలకు అసలు ఇలా ఎందుకు జరుగుతుందా అన్న అనుమానాలు వస్తాయి. ఆ సమయంలోనే ఆ ఊరికి కొత్తగా వచ్చిన వ్యక్తి ఇంట్లో జరుగుతున్న తాంత్రిక పూజల వల్లే ఇది అంతా జరుగుతుంది అని గ్రహించి వాళ్ళను చెట్టుకు కట్టేసి సజీవదహనం చేస్తారు. ఆ సమయంలోనే పుష్కర కాలం తర్వాత మీ ఊరు వల్లకాడు అవుతుంది అని ఆ మహిళ శపిస్తుంది.వరసగా చోటు చేసుకుంటున్న మరణాలను ఆపేందుకు ఆ గ్రామం నుంచి ఎవరూ బయటకికి పోకుండా..బయటి వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా అష్టదిగ్బంధనం చేస్తారు. మరి నిజంగా ఆమె చెప్పినట్లే అవుతుందా...అసలు ఆ ఊరిని కాపాడటానికి హీరో సాయిధరమ్ తేజ్ కు సంబంధ ఏమిటి అన్నదే విరూపాక్ష సినిమా.
తన తల్లితో కలిసి బంధువులను కలవటానికి హీరో సాయిధరమ్ తేజ్ రుద్రవనం గ్రామానికి వస్తాడు. ఒక కోడి దొంగతనం సందర్భంగా హీరోయిన్ సంయుక్త మీనన్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. అయితే వీళ్లిద్దరి లవ్ ట్రాక్ సో సో గానే ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరికైనా అసలు హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ అసలు ఈ సినిమా ఎలా అంగీకరించారు అన్న అనుమానం రాక మానదు. వాస్తవానికి ఈ సినిమా లో సాయిధరమ్ తేజ్ నటనకు ఉన్న పరిధి చాలా తక్కువ. హీరోయిన్ సంయుక్త మీనన్ మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు . అయితే ఇది ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. దర్శకుడు కార్తీక్ వర్మ దండు సినిమాలో సస్పెన్సు ను సమర్ధవంతంగా నడిపించినా ముందు కథ పరంగా సినిమా ఈ తరం ప్రేక్షకులకు ఇది ఎంతమేరకు కనెక్ట్ అవుతుంది అన్నదే సందేహం. సినిమాలో జరిగే హత్యలు ప్రేక్షకులను భయానికి గురిచేస్తాయి. సినిమా లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హై లైట్ గా ఉంది. విరూపాక్ష గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ లను ఎంజాయ్ చేసేవారికే మాత్రమే నచ్చే సినిమా ఇది.
రేటింగ్: 2 . 25 /5