వెట్టయాన్ సినిమా స్టోరీ అంతా ప్రధానంగా పోలీస్ ఎన్ కౌంటర్ లు...మానవ హక్కుల ఉల్లంఘన, విద్యా వ్యాపారం చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో రజనీకాంత్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తారు. ఒక ఎన్ కౌంటర్ లో తప్పు చేయని యువకుడిని కాల్చి చంపుతారు. ఈ తప్పు ఎలా జరిగింది... దీని వెనక ఉన్న కారణాలు ఏంటి అన్నదే వెట్టయాన్ సినిమా. ఒక వైపు పోలీస్ ల ఎన్ కౌంటర్ ఇష్యూ తో పాటు మరో వైపు విద్యా వ్యాపారం స్టోరీకి దర్శకుడు జ్ఞానవేల్ లింక్ పెట్టిన విధానం పర్ఫెక్ట్ గా సెట్ అయింది. పోలీస్ ఆఫీసర్ గా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో రజనీకాంత్ తనదైన యాక్షన్ తో దుమ్మురేపాడు. మానవ హక్కుల విచారణ కమిషన్ అధికారిగా అమితాబ్ బచ్చన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
మరో వైపు ఒకప్పుడు దొంగ గా ఉన్న ఫహద్ ఫాజిల్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన రజనీకాంత్ కు అనధికారికంగా సాంకేతిక అంశాల్లో సహకరిస్తూ ఉంటాడు . వెట్టయాన్ లో ఫహద్ ఫాజిల్ నటన సినిమాకే హై లైట్ అని చెప్పొచ్చు. ఎడ్యూటెక్ కంపెనీ అధినేత పాత్రలో దగ్గుబాటి రానా నటన సూపర్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రానా నటన హై లైట్ గా నిలిచింది. రానా పాత్ర ఎంట్రీ ఇచ్చేది సెకండ్ హాఫ్ లోనే అయినా రజనీకాంత్, దగ్గుబాటి రానాల మధ్య సన్నివేశాలు సినిమాలో హై వోల్టేజ్ తెప్పిస్తాయి అని చెప్పాలి. ఈ సినిమాలో రితికా సింగ్, దుషారా విజయన్ లవి కీలక పాత్రలు. వెట్టయాన్ సినిమా కథ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే అయినా దర్శకుడు జ్ఞానవేల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా కథ నడిపించిన విధానం పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సింపుల్ డైలాగు లే అయినా...పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమాకు మరో ప్రధాన బలం అనిరుద్ మ్యూజిక్ అని చెప్పాలి. రజనీకాంత్ కు జోడిగా నటించి మంజు వారియర్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మొత్తం మీద రజనీకాంత్ వెట్టయాన్ సినిమాతో మరో హిట్ సాధించాడు.
రేటింగ్ : 3 .5 /5