అల్లు శిరీష్. అను ఇమ్మానుయేల్. వీళ్లిద్దరికి హిట్ లేక చాలా కాలమే అయింది. 2019 లో అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ మూవీ సో సో గా ఆడింది. ఇప్పుడు అల్లు శిరీష్. అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన 'ఊర్వశివో రాక్షసీవో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ ఇద్దరూ ఐ టి ఉద్యోగులే. పక్క ఆఫీస్ లో ఉన్నా అను కి లైన్ వేస్తుంటాడు శిరీష్. ఒక రోజు అకస్మాతుగా అను కూడా వీళ్ళ ఆఫీసులోనే జాబ్ జాయిన్ అవుతుంది. దీంతో వీళ్ళ లవ్ సాఫీగా సాగిపోతుంది. లవ్ ట్రాక్ సాదా సీదాగానే ఉన్నా వీళ్లిద్దరి మధ్య పెళ్ళి, సహజీవనం అనే అంశంలో జరిగే సంఘర్షణ సినిమా లో అత్యంత కీలకంగా ఉంటుంది. సహజంగా అబ్బాయిలు సహజీవనం ప్రతిపాదనకు ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ సినిమా లో హీరోయిన్ మాత్రం తనకు తన జీవిత లక్ష్యం ముఖ్యం.. పెళ్లి కాదు అంటూ సహ జీవనం వైపు మొగ్గు చూపుతుంది. కానీ హీరో మాత్రం మధ్య తరగతి కుటంబం వాడు కావటం తో పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళ కోరిక నెరవేర్చాలి అనుకుంటాడు. మరి ఈ పెళ్లి, సహ జీవనం సంఘర్షణలో ఎవరు విజయం సాధిస్తారు అన్నదే సినిమా. ఈ కాన్సెప్ట్..ఎమోషన్స్, కామెడీ లతో దర్శకుడు రాకేష్ శశి సినిమాను పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు. హీరో తన ఇంట్లో వాళ్లకు తెలియకుండానే ఈ సహజీవనం నడిపిస్తాడు.
సినిమా ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా నడిపించారు. దర్శకుడు రాకేష్ శశి బలం రచన, అందులోనే అతను తన ప్రతాపాన్ని చూపించి ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేయగలిగాడు. సహా జీవనం మంచిదా, పెళ్లి చేసుకోవటం మంచిదా అన్న సున్నితమయిన విషయాన్ని ఇప్పటి యువత ఎలా ఆలోచిస్తుందో అలానే చూపించాడు. పక్క మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయం కూడా బాగా టచ్ చేసాడు. సీరియస్ సబ్జెక్టు పై డిస్కస్ చేస్తూనే సినిమాలో భాగంగానే కామెడీ ని కూడా పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా చేయటం విజయం సాధించారు. అల్లు శిరీష్ చాల కాలం తరువాత మంచి నటన కనపరిచాడు. ఇందులో తాను పోషించిన శ్రీ పాత్రకి పర్ఫెక్ట్ అని నిరూపించాడు. నిజంగా శిరీష్ కి ఇది ఒక మంచి సినిమా. పంచ్ డైలాగ్స్ టైమింగ్ తో చెప్పడమే కాకుండా, కామెడీ సన్నివేశాలను కూడా చాలా చక్కగా పండించాడు. ఇంకా అను ఇమ్మానుయేల్ సినిమాకే హైలైట్. ఆమె తన కళ్ళతోనే భావాలు పలికించింది చాలా సన్నివేశాల్లో. ఈ సినిమాతో తను మంచి రోల్ వస్తే నటించి చూపించ గల సత్తా వున్నా నటి అని చెప్పగలిగింది. ఆమెకి శిరీష్ కి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా సెట్ అయింది. అదే సినిమా బాగుండటానికి ముఖ్య కారణం. ఈ సినిమా శిరీష్ కి, అను ఇమ్మానుయేల్ కి ఇద్దరికీ మంచి బ్రేక్ ఇస్తుంది అనటం లో సందేహం లేదు. ముఖ్యంగా వెన్నెల కిశోర్, సునీల్ లు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. యూత్ ని టార్గెట్ చేసుకుని తెర కెక్కించిన సినిమా ఇది. అల్లు శిరీష్ ఈ సినిమా తో తన కథలో హిట్ వేసుకున్నట్లే.
రేటింగ్: 3.25/5