'ఉప్పెన' మూవీ రివ్యూ

Update: 2021-02-12 07:11 GMT

ఈ మధ్య పాటలు సినిమాల మీద హైప్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అవుతున్నాయి. 'ఉప్పెన' సినిమా విషయంలో కూడా అదే జరిగింది. 'నీ కన్ను నీలి సముద్రం' పాట ఉప్పెన సినిమాకు ప్రచారం తీసుకోవటంలో కీలక పాత్ర పోషించింది. దీనికి తోడు హీరోయిన్ కృతిశెట్టి హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎంతో హైప్ క్రియేట్ చేసిన 'ఉప్పెన' సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. మరి అసలు సినిమా ఎలా ఉందో చూద్దాం. 2002 సంవత్సరం నుంచి సినిమా కథ మొదలవుతుంది. ఓ గొప్పింటి..వంశాల గురించి గొప్పగా చెప్పుకునే కుటుంబంలోని అమ్మాయిని ...ఓ జాలరి కొడుకు ప్రేమిస్తాడు. ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులు చాలానే చూసినా...సినిమా ఫస్టాప్ అంతా సాఫీగా..హాయిగా సాగిపోతుంది. ఫస్టాఫ్ లో హీరోయిన్ కృతిశెట్టి, ఆమె తండ్రిగా నటించిన విజయ్ సేతుపతి, హీరో వైష్ణవ్ తేజ్ లు కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా తమ నటనతో ఆకట్టుకుంటారు. సెకండాఫ్ లో సినిమా గాడి తప్పుతుంది.

ఓ జాలరి కొడుకును ప్రేమించిందనే కారణంతో హీరోయిన్ తండ్రి ఏకంగా హీరో కు మగతనం లేకుండా చేస్తాడు. దీంతో పాటు హీరోయిన్, హీరోయిన్ తండ్రి మధ్య వచ్చే డైలాగ్ లు కూడా ప్రేక్షకులను చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. తెలుగు సినిమాలో దర్శకుడు బుచ్చిబాబు మరో కొత్తతరహా పొకడకు తెరతీసినట్లు అయింది. తొలి సినిమా అయినా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రేమ వ్యవహారం వరకూ ఓకే అయినా..సెకండాఫ్ లో భావోద్వేగ సన్నివేశాల సమయంలో మాత్రం తడబడ్డారు. అయితే తండ్రి పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తన పాత్రలో జీవించాడు. ప్రేమ గురించి విజయ్ సేతుపతి, కోపం వస్తే ముసలోళ్లు అవుతారంటూ హీరోయిన్ కృతిశెట్టి చెప్పేడైలాగ్ లు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. ఓవరాల్ గా చూస్తే హైప్ క్రియేట్ చేసినంత ఏమీ లేదు సినిమాలో.

రేటింగ్. 2.5/5

Tags:    

Similar News