శ్రీవిష్ణు కి మరో హిట్ దక్కిందా?!(Swag Movie Review)

Update: 2024-10-04 10:50 GMT

సామజవరగమన సినిమా సూపర్ డూపర్ హిట్ తో హీరో శ్రీవిష్ణు మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. అంతకు ముందు ఈ హీరో చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వరసగా బోల్తా కొట్టాయి. సామజవరగమన హిట్ తర్వాత ఈ హీరో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో కలిసి ఓం..భీం, బుష్ అంటూ సందడి చేశారు. ఈ సినిమా టైటిల్ వెరైటీగా ఉన్నా సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది అనే చెప్పొచ్చు. దసరా సెలవలు టార్గెట్ గా శ్రీవిష్ణు ఇప్పడు శ్వాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలీవుడ్ లో ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు తీస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తే.. హసిత్ గోలి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కథ కూడా ఆయనదే.

                                                         శ్వాగ్ సినిమాలో శ్రీవిష్ణు వెరైటీ లుక్స్ తో సినిమాపై ఆసక్తి క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యారు అనే చెప్పొచ్చు. ట్రైలర్ లోనే ఇది పురుషులు, మహిళలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకుని సినిమాగా స్పష్టత ఇచ్చారు. శ్వాగనిక వంశానికి చెందిన ఒక నిధిని దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాల చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతుంది. అయితే సినిమాలో దర్శకుడు మాతృస్వామ్య వ్యవస్థ, ప్రితృస్వామ్య వ్యవస్థ, ట్రాన్స్ జెండర్స్ ఇష్యూ ఇలా పలు అంశాలను టచ్ చేస్తూ కథను నడిపించారు. అయితే ఈ సినిమా చూసే ప్రేక్షకుడి కి కథ విషయంలో గందరగోళం తప్పదు అని చెప్పొచ్చు. ఒకే సినిమాలో పలు ఉప కథలతో దర్శకుడు సినిమాను గందరగోళం చేశాడు. శ్రీవిష్ణు ఈ సినిమాలో రకరకాల పాత్రలు పోషించాడు. అయితే పోలీస్ అధికారిగా కనిపించిన భవభూతి పాత్ర అంతగా సెట్ కాలేదు.

                                                           శ్రీవిష్ణు ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించటం ..ఆ పాత్రలో పలికించిన భావోద్వేగాలు మాత్రం సూపర్ అని చెప్పాలి. ఈ సినిమా లో శ్రీవిష్ణు కు జోడి గా నటించిన రీతూ వర్మ పురుషులకంటే మహిళలే గొప్ప అని గట్టిగా నమ్మే రాణి పాత్రలో ఆకట్టుకుంది. అయితే ఈ పాత్ర చాలా పరిమితంగానే ఉంటుంది. చాలా కాలం తర్వాత మీరా జాస్మిన్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో హీరోయిన్ దీక్షా నగార్కర్ పాత్ర పరిమితమే. మొత్తం మీద స్వాగ్ సినిమాలో హాస్పిటల్ లో నర్సు, ఒక చర్చి లో శ్రీవిష్ణు, గెటప్ శ్రీను కామెడీ మాత్రమే ప్రేక్షకులకు కాస్త ఊరటనిచ్చే అంశాలు. ఇవి మినహా స్వాగ్ సినిమా ఏదో రొటీన్ మూవీ గానే మిగిలిపోతుంది.

                                                                                                                                                                                                                                                    రేటింగ్ :2 .5 /5

Tags:    

Similar News