'రొమాంటిక్' మూవీ రివ్యూ

Update: 2021-10-29 13:09 GMT

ఈ సినిమా టైటిల్..ప్ర‌చార చిత్రాలు చూసిన‌ప్పుడే ఇది ఏ లైన్ లో వెళుతుందో తేలిపోతుంది. ఈ మేర‌కు ప్రేక్షకుల‌కు ఈ సినిమా విష‌యంలో చాలా వ‌ర‌కూ స్ప‌ష్ట‌త ఉంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్ త‌న కొడుకు ఆకాష్ పూరీని గ‌తంలో హీరోగా నిల‌బెట్టేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఏమీ ఫ‌లించ‌లేదు. ఈ సారి 'రొమాంటిక్' మూవీతో మ‌రో ప్ర‌య‌త్నం చేశాడు. క్లిస్ట‌ర్ క్లియ‌ర్ గా యూత్ ను టార్గెట్ చేసి సినిమాను విడుద‌ల చేశార‌నే చెప్పాలి. పూరీ జ‌గ‌న్నాధ్ ఈ సినిమా కు క‌థ అందించారు. అంతే కాదు చార్మితో క‌ల‌సి ఈ సినిమా నిర్మాణ బాధ్య‌త‌లు తీసుకున్నారు. రొమాంటిక్ మూవీపై హైప్ క్రియేట్ చేయటానికి పూరీ జ‌గ‌న్నాధ్ చేయాల్సిన ప్ర‌య‌త్నాలు అన్నీ చేశారు. ఏకంగా హీరో ప్ర‌భాస్ తో ఆకాష్‌, ఈ సినిమా హీరోయిన్ కేతికా శ‌ర్మ‌ల‌తో ఇంట‌ర్వ్యూ చేయించాడు. అంతే కాదు టాలీవుడ్ లోని ప్ర‌ముఖులు అంద‌రికీ స్పెష‌ల్ షో వేసి మ‌రీ ఈ సినిమా చూపించి..వాళ్ల‌తో స్పంద‌నలు చెప్పించ‌టం ద్వారా మంచి ఓపెనింగ్స్ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేశాడు. ఇక సినిమా అస‌లు క‌థ విష‌యానికి వ‌స్తే వాస్కోడిగామ (ఆకాశ్ పూరీ) గోవా వేదిక‌గా సాగే డ్ర‌గ్స్ గ్యాంగ్ లో చేర‌తాడు. కొద్ది రోజుల‌కే ఓ గ్యాంగ్ ను లీడ్ చేసే స్థాయికి చేరుకుంటాడు. ఆ క్ర‌మంలోనే మోనిక (కేతికా శర్మ) అనే అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయికి కూడా అతడంటే ఇష్టం ఏర్పడుతుంది. ఓ పోలీస్ కానిస్టేబుల్ (ఉత్తేజ్) చెల్లెలు ఆమె. వాస్కో‌కి శ్యాంసన్ (మకరన్ దేశ్ పాండే) అనే మరో డ్రగ్ లీడర్‌కి మాల్ విషయంలో గొడ‌వ జ‌రుగుతుంది. వాస్కోడిగామా ఓ పోలీసాఫీసర్‌ను చంపడం వల్ల అతడి కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏసీపీ రమ్యా గోవారికర్ (రమ్యకృష్ణ) రంగంలోకి దిగుతుంది.

గోవా పోలీసుల‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ గా మారిన వాస్కోడిగామా పోలీసుల‌కు చిక్కుతాడా?..అత‌గాడి ప్రేమ స‌క్సెస్ అయిందా అన్న‌దే సినిమా. మొహానికి, ప్రేమకు డిఫరెన్స్ తెలియని ఇద్దరు ప్రేమికులు.. తాము మోహంలో ఉన్నామనే భ్రమలో ప్రేమలో పడడం అనే పాయింట్‌తో ఈ సినిమా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు అనిల్ పాదూరి. అదే స‌మ‌యంలో యూత్‌కు కనెక్ట్ అయ్యే అన్ని అంశాల్ని పుష్కలంగా వాడేసుకున్నారు. పూరీ మార్క్ క్యార‌క్ట‌రైజేష‌న్ తో హీరోను ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేసినా ఆకాష్ పూరీ న‌ట‌న‌లో ఇంకా ప‌రిణ‌తి సాధించాల్సి ఉంది. అయితే గ‌త సినిమాల‌తో పోలిస్తే చాలా వ‌ర‌కూ మెరుగైన‌ట్లే క‌న్పిస్తోంది. సినిమాకు 'రొమాంటిక్' అనే సాఫ్ట్ టైటిల్ పెట్టినప్పటికీ ఈ సినిమాను పూర్తిగా బోల్డ్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కించారు. పేరుకు తగ్గట్టే ఈ సినిమాలోని రొమాన్స్‌ను పీక్స్ లో చూపించాడు దర్శకుడు. హీరోయిన్‌తో ఆకాశ్ రొమాంటిక్ సీన్స్ అన్నీ కుర్రకారును ఆక‌ట్టుకుంటాయి. మోనికగా కేతికా శర్మ గ్లామర్ అపీరెన్స్ మెప్పిస్తుంది. ఇక పోలీసాఫీసర్‌గా రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంది. అలాగే ఆమె డైలాగ్స్ కూడా మెప్పిస్తాయి. లాజిక్కులు పక్కన పెట్టి సినిమాను చూస్తే ఓకే. ఓవ‌రాల్ గా చూస్తే రొమాంటిక్ ఓ పూరీ మార్క్ మ‌సాలా సినిమా.

రేటింగ్. 2.5\5

Tags:    

Similar News