‘రావణాసుర’ మూవీ రివ్యూ

Update: 2023-04-07 06:01 GMT

టాలీవుడ్ లో మాస్ మహారాజ గా పేరున్న రవితేజ వరస సినిమాల తో యమా జోష్ లో ఉన్నాడు. ఈ హీరో నటించిన ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. చిరంజీవి తో కలిసి రవి తేజ నటించిన వాల్తేర్ వీరయ్య కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది. ఇప్పడు రవితేజ ‘రావణాసుర’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి రవితేజకు హ్యాట్రిక్ విజయం అందిందా?. ‘రావణాసుర’ సినిమా లో భారీ తారాగణమే ఉంది. అయితే సినిమా అంతా కూడా హీరో రవితేజ, సుశాంత్, ఫరియా అబ్దుల్లా చుట్టూనే తిరుగుతుంది. మిగిలిన పాత్రలు అన్నీ ఇంచు మించు గెస్ట్ పాత్రలుగానే ఉంటాయి. ఈ సినిమాలో హీరోయిన్లు మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యూల్, దక్షా నాగర్కర్ లు ఉన్నా వీరంతా ఎప్పుడో ఒకసారి మాత్రమే కనిపిస్తారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే రవితేజ లాయర్ ఫరియా అబ్దుల్లా వద్ద జూనియర్ గా పనిచేస్తాడు. వీళ్లిద్దరు ఒకే కాలేజీ లో చదువుకుంటారు. ఆ చనువుతో ఆమె వద్దు అనే కేసు లు కూడా టేక్ అప్ చేసేలా ఒప్పిస్తూ ఉంటాడు. తర్వాత తన తండ్రిపై పడ్డ హత్య కేసు టేక్ అప్ చేయాల్సిందిగా మేఘా ఆకాష్ లాయర్ ఫరియా అబ్దుల్లా వద్దకు వస్తుంది. కానీ ఈ హత్య చేసింది సంపత్ రాజ్ అనే విషయం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా ఉండటం, సాక్ష్యాలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉండటంతో ఈ కేసు టేక్ అప్ చేయటానికి నో చెపుతుంది.

                                 కానీ తన ప్రేమ కోసం ఈ కేసు ఒప్పుకోవాలని ఒత్తిడి చేసి ఒప్పిస్తాడు రవి తేజ, తర్వాత వరసగా ఇలాంటి హత్యలే జరుగుతూ ఉంటాయి. హత్య చేసేది ఒకరు...కానీ నేరాలు మాత్రం మరొకరిపై పడుతూ ఉంటాయి. పోలీస్ లకు ఈ కేసు ఛేదించటం చాలా సంక్లిష్టంగా మారుతుంది. మరి పోలీస్ లు ఈ కేసు ను ఎలా ఛేదించారు...ఇందులో రవి తేజ రోల్ ఏమిటి అన్నదే సినిమా. దర్శకుడు సుదీర్ వర్మ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ని ఆసక్తికరంగా తెరకెక్కించటలో ఒకింత విజవంతం అయ్యారనే చెప్పాలి. అయితే ఇందుకు అయన ఎంచుకున్న కథ ఇప్పటికే పలు సినిమాల్లో ప్రేక్షకులు చూసిందే కావటం మైనస్ పాయింట్ గా మారింది. . బహుశా అందుకే అనుకుంటా దర్శకుడు ఈ హత్యల వెనక ఉన్న కారణం చెప్పటానికి బాగా టైం తీసుకున్నాడు. లేదంటే సినిమా ఫలితం మాత్రం దారుణంగా ఉండేది. హీరో రవితేజ మాత్రం నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో మాత్రం ఇరగదీశాడు అనే చెప్పాలి. అదే సమయంలో ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. రావణాసుర సినిమాను ఒక రేంజ్ లో నిలపడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలక పాత్ర పోషింది అని చెప్పాలి. ఓవర్ అల్ గా చూస్తే దర్శకుడు సుదీర్ వర్మ పాత కథ తో కొత్త ప్రయోగం చేసి కొంత మేర విజయం సాధించాడు అని చెప్పాలి.

రేటింగ్: 2 .75 /5

Tags:    

Similar News