'క్రాక్' మూవీ రివ్యూ

Update: 2021-01-10 06:59 GMT

హీరో రవితేజకు గత కొంత కాలంగా కాలం కలసి రావట్లేదు. ఆయన కు సరైన హిట్ లేక చాలా కాలమే అయింది. కరోనా కల్లోలం నుంచి ఒకింత కోలుకున్న తర్వాత అంటే తొమ్మిది నెలల తర్వాత 'క్రాక్'తో రెడీ అయ్యాడు. తొలి రోజు సినిమా విడుదల కాకపోవటం రవితేజ ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ సమస్యలను అధిగమించి శనివారం రాత్రి నుంచి షోలు ప్రారంభం అయ్యాయి. గతంలో తనకు 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా కావటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇక సినిమా అసలు విషయానికి వస్తే పోత రాజు వీర శంకర్ (రవితేజ) పోలీసు అధికారి. బ్యాగ్రౌండ్‌ అని ఎవడైనా విర్రవీగితే చాలు వాళ్లతో ఆడుకుంటాడు. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేరస్థులతో తనదైనశైలీలో సీఐ వీర శంకర్ వైరం పెట్టుకుంటాడు. వారిలో ఒంగోలుకు చెందిన కటారి (సముద్రఖని) అత్యంత పవర్ ఫుల్. అతను అంటే చుట్టుపక్కల 20 ఊర్లకు భయం. అలాంటి వ్యక్తిపై వీరశంకర్‌ తిరుగుబాటు చేస్తాడు. తన సహోద్యోగి కొడుకు చావుకు కారణాలు తెలుసుకునే క్రమంలో కటారితో వైరం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో వీరశంకర్‌ని చంపడానికి కటారి రకరకలా ప్లాన్‌ వేస్తాడు. ఇది పూర్తిగా రవితేజ ఫ్యాన్స్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన సినిమాలు కన్పిస్తోంది. గతంలో చాలా సినిమాల్లో చూసిన కథనే దర్శకుడు కొత్తగా చూపించే ప్రయత్నం చేసి..ఒకింత సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

కథ నేపథ్యాన్ని హీరో వెంకటేశ్‌తో చెప్పించారు. రోటీన్‌ కథని దర్శకుడు తెరపై చూపించే విధానం చాలా బాగుంది. కాకపోతే హీరో, హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ సైతం పండలేదు. ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. తమన్‌ తన పాటలతో పాటు.. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశాడు. తనదైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో యాక్షన్‌ సీన్లకు ప్రాణం పోశాడు. ఇక రామ్‌లక్ష్మణ్‌ పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్‌ అని చెప్పొచ్చు. ఫైట్స్‌ చాలా కొత్తగా ఉన్నాయి. సినిమాలో రవితేజ విలన్స్‌ కి మధ్య జరిగే పోరాటాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. యాక్షన్‌ సీన్లు అన్ని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ బాగుంది. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రవితేజ తన ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకన్నాడు. ఓవరాల్ గా చూస్తే రవితేజ ఫ్యాన్స్ కు సంక్రాంతి ముందుగానే వచ్చినట్లు.

రేటింగ్.3/5

Tags:    

Similar News