టాలీవుడ్ యువనటుడు కిరణ్ అబ్బవరం తపన ఉన్న హీరో. గత సినిమాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కొద్దిగా గ్యాప్ తీసుకుని వెరైటీ టైటిల్ క పేరుతో ఏకంగా పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించాడు. కానీ థియేటర్లు అందుబాటులో లేక దీపావళి రోజున ఒక్క తెలుగులోనే ఈ సినిమాను విడుదల చేశారు. క మూవీ ట్రైలర్ తో పాటు ఈ సినిమా కథ లైన్ ను గతంలో ఎక్కడైనా చూశాం అని చెపితే తాను ఇక సినిమాలు చేయను అంటూ కిరణ్ అబ్బవరం సవాల్ విసరటం వంటివి ఈ సినిమాపై అంచనాలు పెంచాయని చెప్పాలి. అయితే భారీ అంచనాల మధ్య విడుదల ఈ సినిమా అంచనాలు అందుకుందా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే కథలో కొత్తదనం ఉన్నా కూడా క సినిమా ను గ్రిప్పింగ్ గా...ఆకట్టుకునే లా అంటే..ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా చేయటంలో దర్శక ద్వయం సుజీత్-సందీప్ లు విఫలం అయ్యారు అనే చెప్పాలి. ఇక సినిమా కథ విషయానికి వస్తే సాయంత్రం మూడు గంటలకే చీకటిపడే కృష్ణగిరి అనే ఊరు. అనాథ అయిన హీరో ఆ ఊరిలో తాత్కాలిక పోస్ట్ మ్యాన్ గా పని చేస్తూ ..అందరి ఉత్తరాలు చదువుతూ ఉంటాడు.
అలా చదివే క్రమంలో తనకు ఎవరూ లేకపోవటంతో ఆ ఉత్తరాల్లో ఉండే ఎమోషన్స్ తో కనెక్ట్ అవుతూ ఉంటాడు. తనకు ఉద్యోగం ఇచ్చిన ఆ ఊరి పోస్ట్ మాస్టర్ కూతురితోనే ప్రేమలో పడతాడు. ఈ సినిమాలో హీరో కిరణ్ కు జోడిగా నయన్ సారిక నటించింది. అయితే కొద్ది రోజులకు ఆ ఊరికి వచ్చే ఉత్తరాలకు..ఊరి నుంచి మిస్ అయ్యే అమ్మాయిలకు మధ్య లిండ్ ఉంది అని గ్రహిస్తాడు హీరో. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు..ఇందులో హీరో కి ఎదురైన సవాళ్లు ఏంటి అన్నది క సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ ‘క’ సినిమా లో అభినయ్ వాసుదేవ్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటన పరంగా గత సినిమా ల కంటే ఎంతో మెరుగుఅయ్యాడు అనే చెప్పాలి. నయన్ సారిక తో పాటు మరో కీలక పాత్రలో నటించిన తన్వి రామ్ కూడా హోమ్లీ లుక్స్ లో ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అయితే వెరైటీ టైటిల్ తో కిరణ్ అబ్బవరం అండ్ టీం ఈ సినిమా కు హైప్ తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. కానీ ఈ క సినిమాలో క్లారిటీ మిస్ అయింది అనే చెప్పాలి.
రేటింగ్ : 2 .75 \5