ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా నాని వన్ మ్యాన్ షో. హీరోయిన్ మృణాల్ ఠాకూర్, బేబీ కియారా లు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ పాత్రలో..లుక్ పరంగా నాని పర్ఫెక్ట్ గా ఉన్నాడు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకుంది. బేబీ కియారా కూడా తన పాత్రలో చాలా బాగా చేసింది. హాయ్ నాన్న సినిమా క్లైమాక్స్ లో ప్రేక్షకులు కంట తడి పెట్టకుండా ఎవరూ బయటకు రారు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. సినిమా అంతా ఎక్కువ భావోద్వేగ సన్నివేశాలతోనే సాగుతుంది. ఈ సినిమా కు కథ అందించటం తో పాటు దర్శకత్వం వహించింది శౌర్యువ్. తొలి సినిమానే అయినా కూడా ఎక్కడా గందరగోళం లేకుండా తెరకెక్కించడంలో దర్శకుడు శౌర్యువ్ విజవంతం అయ్యారనే చెప్పాలి. కథ దగ్గరకు వస్తే కొన్ని పాత సినిమాలు గుర్తుకు వస్తాయి. అయినా కూడా తాను అనుకున్న లైన్ లో హాయ్ నాన్న ను ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశారు. చాలా చోట్ల భావోద్వేగ సన్నివేశాలతో సినిమాను నడిపించారు. ఈ సినిమా లో ప్రియ దర్శి, జయరాం, శృతి హాసన్ కీలకపాత్రలు పోషించారు. హాయ్ నాన్న మూవీ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా మూవీ.
రేటింగ్: 3 /5