ఏ సినిమా కు అయినా కథే ముఖ్యం. అయితే పాత కథలతో కూడా కొత్త సినిమా తీయటం..దాన్ని విజయవంతం చేయటం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే దర్శకుడు నక్కిన త్రినాథ రావు మాత్రం ఈ విషయంలో ఖచ్చితంగా విజయం సాధించారు అని చెప్పాలి. సినిమా ఎవరు అయినా వినోదం కోసమే చూస్తారు. ఈ లెక్కన చూస్తే ధమాకా మూవీలో వినోదం ఫుల్. పూర్తి స్థాయి మాస్ మసాలా ఎంటర్ టైనర్ సినిమా ఇది. రవితేజ సినిమాల విషయానికి వస్తే గత కొంతకాలంగా అన్ని మూస ధోరణిలోనే ఉంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ ధమాకా తో మాత్రం రవి తేజ కాస్త ఆ ముద్ర చెరిపేశాడు అని చెప్ప వచ్చు.రవితేజ కు జోడిగా ఈ సినిమా లో శ్రీలీల సందడి చేసింది. పాటల్లో డాన్స్, ఉన్నంతలో తన యాక్షన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది . సినిమా కథ విషయానికి వస్తే కార్పొరేట్ ప్రపంచంలో కస్టపడి ఎదిగేవాళ్ళు కొంత మంది ఉంటారు...అంత కష్టం మనకు ఎందుకు ఎలాగోలా పేరున్న కంపెనీలను దక్కించుకోవాలని చూసే వాళ్ళు కొంత మంది.
వీళ్ళను అడ్డుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు చాలా సినిమాల్లో చూసినవే. ధమాకా సినిమాలో కూడా అదే స్టోరీ ఉంది. అయితే పాత స్టోరీ ని..ఆసక్తికర సంభాషణలు...మంచి యాక్షన్ సీన్స్ తో సినిమా ను సరదా సరదా గా నడిపించారు. ఫస్ట్ హాఫ్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ...సెకండ్ హాఫ్ లో కాస్త తగ్గినా ఏ మాత్రం ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వరు. ఫైట్స్ లోను స్టైలిష్ రవి తేజ కనిపిస్తారు. పాటలు కూడా ఆకట్టుకునేలా తెర కెక్కించారు. రవి తేజ శ్రీలీల పాత్రలతో పాటు పారిశ్రామికవేత్తలుగా జయ రామ్, సచిన్ ఖేడ్కరు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.రావు రమేష్, జబర్దస్త్ అది ల మధ్య వచ్చే సన్నివేశాలు...సంభాషణలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. మొత్తానికి రవి తేజ కు ఈ ఏడాది చివరిలో మంచి హిట్ దొరికింది అని చెప్పొచ్చు. వినోదం కావాలని కోరుకొనే వారు హాయిగా ఈ సినిమా చూడొచ్చు.
రేటింగ్: 3 \5