వైష్ణవ్ తేజ్ మాస్ ఇమేజ్ ప్రయత్నం ఫలించిందా?!

Update: 2023-11-24 09:24 GMT

తొలి చిత్రం ఉప్పెనతోనే మంచి హిట్ దక్కించుకున్న హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత ఈ హీరో చేసిన రంగ రంగ వైభోగంగా, కొండ పొలం సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఇప్పుడు మరో సారి ఆదికేశవ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కావటం..సినిమా లో హీరోయిన్ గా ప్రస్తుతం టాలీవుడ్ లో దుమ్ము రేపుతున్న శ్రీ లీల కావటంతో ఆదికేశవ సినిమా పై అంచనాలు పెరిగాయనే చెప్పాలి. ఈ సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. అయితే ఈ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు అనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిన పాత కథనే అత్యంత రొటీన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు ఎక్కడా సినిమా లో కొత్తదనం ఫీల్ ఎవ్వడు. సినిమా ఫస్ట్ హాఫ్ మరీ సో సో సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక ట్విస్ట్ తో ఆసక్తి పెంచుతాడు. అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అయితే ఇందులో కూడా పలు ట్విస్ట్ లు ఉన్నా అవి ప్రేక్షకులకు ఎక్కడా థ్రిల్ ఫీల్ ఇవ్వవు అనే చెప్పాలి. ఆదికేశవ సినిమా స్టోరీ మరీ వీక్ గా ఉంది . అంతే కాదు..ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో హింస బోయపాటి సినిమాలను దాటిపోయేలా ఉంది. శ్రీలీల సీఈఓ గా ఉండే కంపెనీ లో వైష్ణవ్ తేజ్ ఉద్యోగంలో చేరి ఆమెతో ప్రేమలో పడతాడు.

                                      తర్వాత సినిమా అంతా రాయలసీమ మైనింగ్, రాజకీయాల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచే అసలైన యాక్షన్ సన్నివేశాలు వస్తాయి. మాస్ లుక్ లో హీరో వైష్ణవ్ తేజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన కూడా మెరుగైంది అనే చెప్పాలి. ఇక శ్రీ లీల విషయానికి వస్తే ఆమె పాత్ర చాలా రొటీన్ గా ఉంటుంది. పాటలు...డ్యాన్స్ లతోనే సాగుతుంది. ఈ సినిమా లో విలన్ పాత్ర పోషించిన జోజు జార్జ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తెలుగు సినిమా లకు కొత్త విలన్ దొరికినట్లే అని చెప్పుకోవచ్చు. వైష్ణవ్ తేజ్ ఫస్ట్ హాఫ్ లో సరదా సరదా కుర్రాడిగా, అటు సెకండ్ హాఫ్ లో రాయలసీమ ప్రాంతానికి చెందిన రుద్ర కాళేశ్వర రెడ్డి గా మంచి నటన చూపించారు. సినిమా కథకు తగ్గట్టు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. కథలో కొత్తదనం లేకపోయినా నిర్మాణ సంస్థ ఏ మాత్రం రాజీ లేకుండా రిచ్ గా సినిమా ను తెరకెక్కించింది.. ఫైనల్ గా ఆదికేశవ అత్యంత సాదా సీదా రొటీన్ ఫార్ములా సినిమా. దీంతో వైష్ణవ్ తేజ్ కు మరో సారి నిరాశే మిగిలింది అనే చెప్పాలి.

                                                                                                                                                                                   Full Viewరేటింగ్: 2 /5

Tags:    

Similar News