యాక్షన్ సన్నివేశాలు..బోల్డ్ కంటెంట్

Update: 2026-01-08 06:34 GMT

కేజీఎఫ్ మూవీ రెండు పార్ట్ లతో హీరో యష్ కు దేశ వ్యాప్తంగా ఒక రేంజ్ ఇమేజ్ వచ్చింది. ఎందుకంటే ఈ మూవీస్ ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపించాయి. ఈ రెండు సినిమాల సూపర్ హిట్ తర్వాత ఈ హీరో చేస్తున్న మూవీ నే టాక్సిక్. గురువారం నాడు యష్ పుట్టిన రోజు కావటంతో ఈ మూవీ లో హీరో యష్ రోల్ ను పరిచయం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు..అదే సమయంలో యష్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. గతంలో కేజీయఫ్ 2 టీజర్ తరహాలోనే కంప్లీట్ ఇంగ్లీష్ లోనే ప్లాన్ చేయడమే కాకుండా యష్ నుంచి షాకింగ్ బోల్డ్ సీన్స్ ఫ్యాన్స్ ని ఒకింత షాక్ కు గురి చేశాయనే చెప్పాలి.

                                  Full Viewగత యష్ సినిమాల్లో ఎప్పుడూ ఇలాంటి సన్నివేశాలకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ వీడియో చూస్తే ఇందులో కూడా కేజీయఫ్ స్టైల్ లోనే రయా పాత్రలో స్వాగ్ తో డామినేట్ చేసేలా ఉన్నాడు. యష్ నటించిన టాక్సిక్ మూవీ ఈ ఏడాది మార్చి 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో సంచనాలు సృష్టించిన ధురంధర్ 2 తో బాక్స్ ఆఫీస్ వద్ద ఢీకొట్టబోతుంది. యష్ పాత్ర పరిచయ వీడియో చూసిన తర్వాత పోటీ గట్టిగానే ఉండబోతున్నట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు సందడి చేయబోతున్నారు. ఇందులో కియారా అద్వానీతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తార సుతారియాలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా వరసగా వీళ్ళ లుక్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News