కింగ్డమ్ గుడ్ స్టార్ట్

Update: 2025-08-01 08:27 GMT

విజయదేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ మూవీ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 39 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ శుక్రవారం నాడు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో విజయదేవరకొండ తో పాటు సత్యదేవ్, వెంకటేష్ లు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. కింగ్డమ్ సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ కావటంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కాకపోతే కింగ్డమ్ ఫలితం పై మాత్రం మిశ్రమ స్పందనలు వ్యక్తం అయ్యాయి. గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న విజయదేవరకొండ కింగ్డమ్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు.

                                          అయితే ఈ సినిమా ఫలితం అయన ఆశించిన స్థాయిలో అయితే లేదు అనే చెప్పొచ్చు. ఎందుకంటే కథలో పెద్దగా కొత్తదనం లేకపోవటంతో పాటు ...ఎమోషన్స్ కూడా అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు. ఇదే సినిమా ఫలితాన్ని దెబ్బకొట్టింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ బాగానే ఉన్నా శుక్రవారం నాటి కలెక్షన్స్ తో పాటు వీకెండ్స్ తర్వాత కానీ అసలు ఫలితం తేలదు. కింగ్డమ్ సినిమా లో విజయకు జోడిగా భాగ్యశ్రీబోర్సే నటిస్తే..ఈ మూవీ కి అనిరుద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా కీలకంగా నిలిచింది. సినిమాలు పలు ఎపిసోడ్స్ ను ఎలివేట్ చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఈ సినిమాలో విజయదేవరకొండ, సత్యదేవ్ ల యాక్షన్ బాగున్నా కూడా కథలో దమ్ములేకపోవటంతో ప్రేక్షకులను ఇది అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Tags:    

Similar News