ప్రభాస్ స్టామినా అంటే ఇదే!

Update: 2026-01-10 09:19 GMT

ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ మూవీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఏకంగా 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఒక హారర్ ఫాంటసీ సినిమా కు ఇంత భారీ మొత్తం వసూళ్లు రావటం ఇదే మొదటి సారి అని పేర్కొంది. కింగ్ సైజు బ్లాక్ బస్టర్ అంటూ ప్రభాస్ న్యూ లుక్ ను విడుదల చేశారు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై ఎక్కువ మంది ప్రేక్షకుల పెదవి విరిచారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా ఈ మూవీ అంతగా నచ్చలేదు అనే చెప్పాలి. మిశ్రమ స్పందనలు వ్యక్తం అయినా కూడా ప్రభాస్ ఇమేజ్ ఆధారంగా ఈ మూవీ ఇంత భారీ మొత్తం వసూళ్లు సాదించగలిగినట్లు చెపుతున్నారు.

                                         రాజాసాబ్ ఫస్ట్ డే వసూళ్లు వంద కోట్ల రూపాయలు దాటతాయి అని నిర్మాత విశ్వప్రసాద్ విడుదలకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా కలెక్షన్స్ 112 కోట్ల రూపాయలుగా నమోదు అయ్యాయి. ఫస్ట్ డే వేసిన ప్రీమియర్స్ తో కలిసి ఈ మొత్తం రికార్డు అయింది. రాజాసాబ్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ లో అందరిని ఆకట్టుకున్నాడు. కానీ సినిమా మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఈ మూవీ లో ప్రభాస్ కు జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ లు నటించారు.

Tags:    

Similar News